కోడెల ఫర్నీచర్ దోచేస్తే, చంద్రబాబు ప్రజాధనాన్ని దాచేశారు : ఇద్దరూ దొంగలేనన్న ఏపీ మంత్రి

By Nagaraju penumala  |  First Published Aug 23, 2019, 7:39 PM IST

మాజీ స్పీకర్ కోడెల దొంగతనంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. ఆ దొంగతనానికి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయా? లేక చంద్రబాబు కూడా ఇలానే ఖజానా నుండి వేల కోట్లు ఇంట్లో, ఆఫీసులో, విదేశీ అకౌంట్లలో దాచేశారా? అని నిలదీశారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఫర్నీచర్ దొంగతనానికి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. 

కోడెల శివప్రసాదరావు తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేసి కోట్లాది రూపాయల ఫర్నీచర్‌ ఎత్తుకుపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫర్నీచర్ తరలించుకుపోయింది బహిరంగంగా కనిపిస్తుందని, అటు కోడెల సైతం అంగీకరించారని కానీ చంద్రబాబు మాత్రం దానిపై మాట్లాడరని సెటైర్లు వేశారు. 

Latest Videos

మాజీ స్పీకర్ కోడెల దొంగతనంపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. ఆ దొంగతనానికి చంద్రబాబు ఆశీస్సులు ఉన్నాయా? లేక చంద్రబాబు కూడా ఇలానే ఖజానా నుండి వేల కోట్లు ఇంట్లో, ఆఫీసులో, విదేశీ అకౌంట్లలో దాచేశారా? అని నిలదీశారు. 

ఖజానా దాచేసిన అంశంలో చంద్రబాబు దొరికితే ఊరికే స్విస్‌ బ్యాంక్‌లో దాచానంటారేమోనని పంచ్ డైలాగులు వేశారు. అమరావతిలో ఇనుప బీరువాలు సరిగ్గా లేవు, ట్రెజరీలో భద్రత లేదు, బ్యాంకులకే గ్యారంటీ లేదు అని చెబుతారేమో చూడాలి అంటూ పంచ్ డైలాగులు వేస్తూ తిట్టిపోశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

ఈ వార్తలు కూడా చదవండి

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

click me!