అమిత్ షాను జగన్ కలిస్తే ఒక ఏడుపు.. కలవకపోతే మరో ఏడుపు: టీడీపీపై సజ్జల విమర్శలు

By Siva KodatiFirst Published Jun 11, 2021, 6:33 PM IST
Highlights

ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని తెలిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారని తెలిపారు.

ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని తెలిపారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శుక్రవారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల తర్వాత జగన్ ఢిల్లీ వెళ్లారని తెలిపారు. రాజకీయాలతో ఈ సమావేశాలకు సంబంధం లేదని... రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన సాగిందని సజ్జల వెల్లడించారు.

రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలను జగన్ ప్రస్తావించారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఢిల్లీలో చీకటి ఒప్పందాలు చేసుకునేవారని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే నాడు చంద్రబాబు పర్యటను సాగించేవారని ఆరోపించారు. హోంమంత్రి అపాయింట్‌మెంట్ వాయిదాపడితే అదో పెద్ద తప్పా అంటూ సజ్జల ప్రశ్నించారు. అమిత్ షాను కలవడంపై ఓ ఛానెల్ నానా రాద్ధాంతం చేస్తోందంటూ ఆయన మండిపడ్డారు.

Also Read:ఆ నిర్ణయంతో అన్యాయం... ఏపీ కోటా పెంచి న్యాయం చేయండి: కేంద్ర మంత్రి గోయల్ ను కోరిన జగన్

అమిత్ షాను సీఎం కలిస్తే టీడీపీ ఒక ఏడుపు.. కలవకపోతే మరో ఏడుపు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు ముందుకు సాగలేదని సజ్జల ఎద్దేవా చేశారు. 2014 నుంచి 2017 వరకు పోలవరం పనులు జరగలేదని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కరోనా సమయంలో కూడా పోలవరం పనులు జరుగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని టీడీపీ ఆపాలని చూసినా అధికార వికేంద్రకరణ జరగడం ఖాయమని సజ్జల పేర్కొన్నారు. 

click me!