వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆరోపణలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ పై, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలను చేసారు.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల ప్రధానాధికారి రామేష్ కుమార్ నిన్నగడ్డ ఈ విషయాన్నీ వెల్లడించారు.
ఇక ఆతరువాత వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికలను వాయిదావేయడంపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన గవర్నర్ ని కూడా కలిసి ఎన్నికల అధికారిపై ఫిర్యాదు చేసారు.
Also read: ఎన్నికల వాయిదాపై జగన్, వైసీపీ నేతల ఆరోపణలు: స్పందించిన ఈసీ రమేశ్ కుమార్
వైసీపీ శ్రేణులన్నీ కూడా జగన్ కు మద్దతుగా రమేష్ కుమార్ ని టార్గెట్ గా చేసి ఆయనది, చంద్రబాబుది ఒకటే కులం కావడం వల్ల ఇలా చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఆరోపణలు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా ఎన్నికల ప్రధానాధికారి రమేష్ కుమార్ పై, చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలను చేసారు.
చంద్రబాబు సిఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన ‘స్లీపర్ సెల్స్’ కరాఖండీగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే పెద్దోడు. ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు’.
— Vijayasai Reddy V (@VSReddy_MP)"చంద్రబాబు సిఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన ‘స్లీపర్ సెల్స్’ కరాఖండీగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే పెద్దోడు. ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు’." అని ఒక ట్వీట్ లో రాసుకొచ్చారు.
ఇక ఒక రెండు గంటల ముందు మరో ట్వీట్లో రమేష్ కుమార్ పై నేరుగా వ్యూఅవస్థలను కాపాడాల్సిన వ్యక్తి ఇలా చేయడమేంటనీ ఆరోపణలు గుప్పించారు. అంతే కాకుండా రమేష్ కుమార్ కూతురు శరణ్యకు చంద్రబాబు పదవిని కల్పించిన విషయం స్ఫురించేలా కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కుల పెద్దకు ‘శరణ్య’మన్నాడు. ఇక ఎవరిని నమ్మాలి? ప్రజల చెల్లించిన పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఈ ఊడిగం చేయడమేమిటి? కరోనా సాకుగా దొరికిందా? నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సిందిపోయి అడ్డంగా పడుకుంటే ఆగుతుందా?
— Vijayasai Reddy V (@VSReddy_MP)"న్యాయమూర్తిలా నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కుల పెద్దకు ‘శరణ్య’మన్నాడు. ఇక ఎవరిని నమ్మాలి? ప్రజల చెల్లించిన పన్నుల నుంచి జీతభత్యాలు తీసుకుంటూ ఈ ఊడిగం చేయడమేమిటి? కరోనా సాకుగా దొరికిందా? నియంత్రించాలని ప్రభుత్వానికి చెప్పాల్సిందిపోయి అడ్డంగా పడుకుంటే ఆగుతుందా?" అని ప్రశ్నించారు.