స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన విమర్శలపై జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వాాయిదా కరెక్టా, కాదా అని చెప్పడానికి తనకు హక్కు లేదని జేసీ అన్నారు.
అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాక్ర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఎన్నికలను వాయిదా వేశారని జగన్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, పోవయ్యా.. బుద్ధి లేని మాటలు అని జేసీ అన్నారు.
సీఎం సామాజికవర్గం యాడాడ (ఎక్కడెక్కడ), ఎంతెంత మంది ఉన్నారో చూసుకో అని ఆయన అన్నారు. జేసీ దివాకర్ రెడ్డి సోమవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు కాబట్టే ఎన్నికలను వాయిదాకు కుట్ర చేశారని చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. కుట్ర కాదు, కుట్ర కాదు... వీపులు పగులగొడుతూ ఉంటే ఏకగ్రీవాలు అవుతున్నాయని ఆయన అన్నారు.
Also Read: ఏపీ స్థానిక సంస్థల రగడ: సుప్రీంకోర్టులో పిటిషన్... రేపు విచారణ!
ఎన్నికల వాయిదాపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా, నేనేందే మాట్లాడేది, ఈసీ నిర్ణయం కరెక్టా, కాదా అని చెప్పే హక్కు నాకు లేదని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు చెప్పాలని ఆయన అన్నారు. సామాన్యులమైన నువ్వూ నేనూ ఎవరు చెప్పడానికి అని జేసీ ఆన్నారు.
ఏపీలో భస్మాసురుడున్నాడని, తన నెత్తిమీద తానే చెయి పెట్టుకుంటాడని, ఆ భస్మాసురుడెవరో అందరికీ తెలుసునని జేసీ ఆన్నారు. ఎన్నికల ప్రక్రియను కుదించడం మంచిదేనని అభిప్రాయపడ్డారు. మావాడు జగన్ తెలివైనవాడని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: అందుకే చేశారా: ఈసీ నిమ్మగడ్డ కూతురిని ప్రస్తావించి అనిల్ ఫైర్
రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని ఆయన అన్నారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి, పోలీసు ఉంటే సరిపోతుందని ఆయన జగన్ తీరుపై మండిపడ్డారు. ప్రతి ఒక్కరికీ సామాజిక వర్గం ఉంటుందని, అది లేనివారు ఎవరో చెప్పాలని ఆయన అన్నారు.