ఏపీ స్థానిక సంస్థల రగడ: సుప్రీంకోర్టులో పిటిషన్... రేపు విచారణ!

By Sree s  |  First Published Mar 16, 2020, 12:50 PM IST

నేటి ఉదయం సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పిటిషన్ దాఖలయింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ లో జరిపించాలని కోరుతూ ఈ పిటిషన్ ను దాఖలు చేసారు. 


ఆంధ్రప్రదేశ్ లో నిన్న ఎన్నికల ప్రధానాధికారి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఆయన ప్రకటించారు. 

ఆయన అలా వాయిదా వేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనయిన జగన్ మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రెస్ మీట్ పెట్టి మరి ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసారు. 

Latest Videos

ఇది ఇలా ఉండగా నేటి ఉదయం సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పిటిషన్ దాఖలయింది. స్థానిక సంస్థల ఎన్నికలను ఆంధ్రప్రదేశ్ లో జరిపించాలని కోరుతూ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది ఆంధ్రప్రాయశ్ ప్రభుత్వం. 

ఈ పిటిషన్ ను స్వీకరించిన ధర్మాసనం దాని మీద విచారణ చేపడతామని తెలిపింది. రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది. 

ఇక జగన్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ఎన్నికల కమీషనరేట్‌లో ఉన్న సెక్రటరీకి ఇలాంటి ఆర్డర్ ఒకటి తయారవుతున్నట్లు తెలియదని.. ఎవరో రాస్తున్నారని, ఎవరో ఆదేశాలు ఇస్తున్నారని అప్పుడు రమేశ్ కుమార్ చదువుతున్నారని సీఎం ఆరోపించారు. ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు సీఎం జగన్.

ఈయనను తమ ప్రభుత్వం నియమించలేదని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తన సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్‌గా నియమించారని జగన్ గుర్తుచేశారు.

Also Read:స్థానిక ఎన్నికలపై ఈసీ సీరియస్: వేటు పడిన అధికారులు వీరే...

ఎన్నికల కమీషనర్‌కు ఉండాల్సిన ప్రాథమిక లక్షణం నిష్ఫాక్షకతని.. అదే సమయంలో రమేశ్ విచక్షణ సైతం కోల్పోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. ఏదైనా అధికారి విధులు నిర్వర్తించేటప్పుడు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా పనిచేయాలని అలాంటప్పుడే ఆ వ్యక్తికి లేదా అధికారికి గౌరవం కలుగుతుందన్నారు.

రమేశ్ కుమార్ ఒకవైపు కరోనా వైరస్ కారణంగానే ఎన్నికలను వాయిదా వేస్తున్నానని చెప్పి,  అదే ప్రెస్‌మీట్‌లో గుంటూరు, చిత్తూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు మరికొంతమంది అధికారులను బదిలీ చేస్తూ ప్రకటన చేశారని సీఎం ధ్వజమెత్తారు.

ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఎన్నికల అధికారి విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చునని జగన్ సూచించారు. 151 మంది ఎమ్మెల్యేల బలంతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రికి పవర్ ఉంటుందా.. రమేశ్ కుమార్ అనే అధికారికి ఉంటుందా అని సీఎం ప్రశ్నించారు.

Also Read:పారాసిటమాల్: కరోనా వైరస్‌పై కేసీఆర్ మాటే.. జగన్ నోట

అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఎక్కుడుందన్న ఆయన ఈ మధ్యకాలంలో అందరూ విచక్షణాధికారం అనే మాట వాడేస్తున్నారని మండిపడ్డారు. ఎస్పీలను, కలెక్టర్లను మార్చడంతో పాటు పేదలకు సంబంధించిన ఇళ్ల పట్టాలు ఇవ్వొద్దంటున్నారని ఇదంతా తనకు ఆశ్చర్యంగా ఉందని జగన్ వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యంలో ఇక ప్రజలు ఓట్లు వేయడం ఎందుకు.. ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకన్న ఆయన ఎన్నికల కమీషనర్లనే ముఖ్యమంత్రిగా చేసేయవచ్చు కదా అని జగన్మోహన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. 

click me!