నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కౌంటర్: వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published : Jan 23, 2021, 12:49 PM IST
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు కౌంటర్: వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంపై ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఏపీ ఉద్యోగ సంఘాల ప్రతినిధి వెంకట్రామిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఆయన మండిపడ్డారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. 

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, వాక్యిన్ ఇచ్చేంత వరకు తాము విధుల్లో పాల్గొనబోమని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. ప్రాణాపాయం వస్తే ఎదుటి వ్యక్తి ప్రాణాలు తీసే హక్కును కూడా రాజ్యాంగం కల్పించందని, ఇది అంతకన్నా పెద్దదా అని అన్నారు. 

Also Read: నిమ్మగడ్డతో పంచాయతీ: ఆదేశాలు బేఖాతరు, చిత్తూరు జిల్లాలో గందరగోళం

సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆయన చెప్పారు. తాము ఎన్నికలు వద్దని అనడం లేదని, తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే రక్షణ కల్పించాలని కోరుతున్నామని, తమ ప్రాణాలను రక్షించుకునే హక్కును రాజ్యాంగం కల్పించిందని, అందువల్ల ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇవ్వాలని, అది తీసుకున్న తర్వాతనే ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని ఆయన వివరించారు. 

తమ ప్రాణాలకు రక్షణ లేదని ఉద్యోగులు అంటున్నారని, భయం ఉంది కాబట్టి విధులకు దూరంగా ఉండాలనుకునేవారికి ఆ అవకాశం ఇవ్వాలని, ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వచ్చేవారితో నిర్వించుకోవాలని, ప్రాణభయంతో ఉన్నవారు దూరంగా ఉంటామంటే అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు.

Also Read: చర్యలు తప్పవు: పంచాయతీరాజ్ కమిషనర్ మీద నిమ్మగడ్డ సీరియస్

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఏ విధంగానైనా ఎన్నికలు పెట్టాలని అనుకుంటున్నారని, చర్చించి నిర్ణయం తీసుకోవడమంటే కాఫీ తాగి వెళ్లడం కాదని, 13వ తేదీ తర్వాత చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రభుత్వం అంటోందని ఆయన అన్నారు. ఓ వైపు ఉద్యోగులను డిస్మిస్ చేస్తూ మరో వైపు సిబ్బంది లేదని నిమ్మగడ్డ అంటున్నారని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?