ఏపీ శాసమండలిలో 71 రూల్ కింద చర్చించేందుకు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీప్ అంగీకరించారు.
అమరావతి: ఏపీ శాసన మండలిలో 71 రూల్ కింద స్వల్పకాలికి చర్చకు శాసన మండలి ఛైర్మెన్ ఎంఎ షరీప్ అనుమతి ఇచ్చారు. అయితే ఈ విషయమై చర్చకు అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పుబడుతోంది.
Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ
ఏపీ శాసనమండలిలో ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే టీడీపీ సభ్యులు 71 రూల్ కింద నోటీసులు ఇచ్చారు. ఈ రూల్ కింద తొలుత చర్చను ప్రారంభించాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని
ఈ సమయంలో టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు 71 రూల్ కింద చర్చను చేపట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాదు తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపణలు చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ఈ విషయమై టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు లెవనెత్తిన అంశాలను తోసిపుచ్చారు.
also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్
Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ
ఈ సమయంలో శాసనమండలిలో ఎలా చర్చను ,ప్రారంభించాలనే విషయమై సభను వాయిదా వేసిన తర్వాత ఇరు పక్షాలతో శాసనమండలి ఛైర్మెన్ ఎంఎ షరీఫ్ చర్చించారు. 71 రూల్ కింద చర్చను చేపట్టేందుకు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ అనుమతి ఇచ్చారు.
ఈ విషయమై మండలి ఛైర్మెన్ ఎంఏ షరీప్ 71 రూల్ కింద చర్చను అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాలనా వికేంద్రీకరణ బిల్లుపై చర్చకు అనుమతి ఇవ్వాలని ఏపీ శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ ను కోరారు. కానీ 71 రూల్ కింద చర్చకు అనుమతి ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పుబట్టింది.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును కాకుండా టీడీపీ సభ్యుల నోటీసుపై చర్చకు అనుమతి ఇవ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీలకు అతీతంగా మండలి ఛైర్మెన్ షరీఫ్ వ్యవహరించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించకూడదని మంత్రి బొత్స సత్యనారాయణ మండలి ఛైర్మెన్ బొత్స సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలి ఛైర్మెన్ షరీఫ్ స్పందించారు. నిబంధనల ప్రకారంగానే తాను వ్యవహరిస్తున్నట్టుగా మండలి ఛైర్మెన్ షరీఫ్ చెప్పారు.
ఈ సమయంలో టీడీపీ సభ్యులు ప్రభుత్వం వైపు నుండి మంత్రులు మాట్లాడిన మాటలను తప్పుబట్టారు. దీంతో శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీప్ శాసనమండలిని పది నిమిషాల పాటు వాయిదా వేశారు.