
అమరావతి: దేశంలోని ఐదు రాష్ట్రాలు శాసనమండలిని పునరుద్దరించాలని ఆయా రాష్ట్రాలు కోరుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని ఆరు రాష్ట్రాల్లోనే శాసనమండలిలు ఉన్నాయి. దేశంలో రద్దైన శాసనమండలి పునరుద్దరించబడింది ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే. ప్రస్తుత అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేయాలని కోరుతోంది.
Also read:శాసన మండలిపై చంద్రబాబు యూటర్న్ అసెంబ్లీలో వీడియోల ప్రదర్శన
1985లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏపీ శాసనమండలిని రద్దు చేశారు. ఆ సమయంలో శాసనమండలిలో టీడీపీకి ఒక్క సభ్యుడు కూడ లేరు శాసనమండలి వల్ల ప్రభుత్వంపై ఆర్ధిక భారంతో పాటు బిల్లుల ఆమోదంలో జాప్యం జరుగుతోందని ఎన్టీఆర్ భావించారు. శాసనమండలిలో ఆ సమయంలో పలు రంగాల్లో పేరొందినవారు ఉండేవారు.
Also read:జగన్ కోరిక తీరేనా: శాసన మండలి రద్దుకు కనీసం రెండేళ్లు
ఆ సమయంలో ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలను మండలిలో తీవ్రంగా విమర్శలు చేయడంతో మండలిని రద్దు చేయాలని ఆనాడు ఎన్టీఆర్ నిర్ణయం తీసుకొన్నారని ఆనాడు మండలిలో ఉన్న సభ్యులు విమర్శలు చేస్తుంటారు.
1989లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.. ఈ సమయంలో ఆనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మర్రి చెన్నారెడ్డి శాసనమండలిని పునరుద్దరించే ప్రయత్నాలను ప్రారంభించారు. 1989 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కూడ శాసనమండలి పునరుద్దరణ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు.
1990 జనవరి 22న ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో శాసనమండలి పునరుద్దరించాలని కోరుతూ శాసన సభ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. 1990 మే 28వ తేదీన రాజ్యసభలో ఈ బిల్లుకు కూడ ఆమోదం లభించింది. 1991లో చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అప్పటి లోక్‌సభ రద్దైంది. దీంతో ఈ బిల్లు ఆమోదం పొందలేదు.
Also read:ఏపీ శాసనమండలి రద్దు: అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన జగన్
దీంతో శాసనమండలి పునరుద్దరణ ప్రయత్నాలు జరగలేదు. 2004 ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని పునరుద్దరణ చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఘన విజయం సాధించింది. ఈ ఘన విజయానికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర కీలక పాత్ర పోషించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎంగా చేశారు.
ఇచ్చిన హామీ మేరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి శాసనమండలిని పునరుద్దరణ ప్రయత్నాలను ప్రారంభించారు.ఈ బాధ్యతను కాంగ్రెస్ పార్టీ నేత సత్యనారాయణరాజుకు అప్పగించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో శాసనమండలిని పునరుద్దరించాలని కోరుతూ ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసి పంపింది. ఆ సమయంలో ఈ తీర్మానాన్ని అప్పటి విపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు.
2004 డిసెంబర్ 16వ తేదీన ఏపీ కౌన్సిల్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. 2007 జనవరి 10న ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపింది. . 2007 మార్చి 30న ఏపీ శాసనసభ పునరుద్దరణ జరిగింది. 2007 ఏప్రిల్ 2వ తేదీన ఏపీ శాసనమండలిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రసంగించారు. శాసనమండలి పునరుద్దరణను స్వాగతిస్తూ ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రసంగించారు.
దేశ వ్యాప్తంగా రద్దైన శాసనమండలిలో పునరుద్దరణ చేసిన శాసనమండలిగా ఏపీ శాసనమండలికి మాత్రమే చరిత్ర ఉంది. శాసనమండలిని రద్దు చేసిన చరిత్ర ఎన్టీఆర్ రికార్డు సృష్టిస్తే, శాసనమండలిని పునరుద్దరణ చేసిన చరిత్రను వైఎస్ రాజశేఖర్ రెడ్డి దక్కించుకొన్నారు.
ప్రస్తుతం ఏపీ శాసనమండలిని రద్దు చేయాలని జగన్ సర్కార్ ప్రతిపాదిస్తోంది. సోమవారం నాడు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానంపై కేంద్రం ఏం చేస్తోందనేది ఆసక్తి నెలకొంది.
దేశంలోని రాజస్థాన్, ఒడిశా, హిమాచల్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాలు శాసన మండలిలు కావాలని కోరుతున్నాయి. ఇటీవలనే జమ్మూ కాశ్మీర్ లోశాసనమండలి రద్దైంది. ఇక కర్ణాటక, ఏపీ, తెలంగాణ, బీహార్, యూపీ, మహారాష్ట్రల్లో మాత్రమే శాసనమండళ్లు ఉన్నాయి.