వైఎస్ జగన్ ను కలిసిన ఎంపీ సీఎం రమేష్: ఎందుకంటే...

By telugu teamFirst Published Jan 27, 2020, 1:52 PM IST
Highlights

బిజెపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిశారు. తన కుమారుడు రిత్విక్ వివాహానికి రావాల్సిందిగా సీఎం రమేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను బిజెపి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలిశారు. తన కుమారుడి వివాహానికి రావాల్సిందిగా రమేష్ వైఎస్ జగన్ ను ఆహ్వానించారు. ఇరువురి మధ్య ఏ విధమైన రాజకీయాంశాలు కూడా చర్చకు రాలేదని సమాచరం. 

తెలుగదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని కూడా సీఎం రమేష్ తన కుమారుడి వివాహానికి ఆహ్వానించనున్నారు. తెలుగు రాష్ట్రాలుక చెందిన రాజకీయ, సినీ ప్రముఖులను, వ్యాపారవేత్తలను ఆయన తన కుమారుడి వివాహానికి ఆహ్వానించే అవకాశం ఉంది. 

ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రమేష్ కుటుంబ సమేతంగా పిలిచి కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త తాళ్లూరి రాజా కూతురు పూజతో సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం కొన్నాళ్ల క్రితం దుబాయ్ లో జరిగింది. కోట్ల రూపాలు ఖర్చు చేసి సీఎం రమేష్ ఆ నిశ్చితార్థం వేడుకను నిర్వహించారు. 

టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్ సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లతో కలిసి బీజెపిలో చేరిన విషయం తెలిసిందే.

click me!