వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు..: చంద్రబాబు, కేసీఆర్ కు ఐటీ మంత్రి కౌంటర్

Published : Jun 23, 2023, 10:12 AM IST
వైజాగ్ లో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు..: చంద్రబాబు, కేసీఆర్ కు ఐటీ మంత్రి కౌంటర్

సారాంశం

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిపై విషయంలో బిఆర్ఎస్, వైసిపి నాయకుల మధ్య మాటలయుద్దం సాగుతోంది. తమ రాష్ట్రంలో భూములధరలు ఎక్కువంటే తమ రాష్ట్రంలోనే ఎక్కువని ఇరు రాష్ట్రాల నాయకులు అంటున్నారు. 

విశాఖపట్నం : తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనుక్కోవచ్చన్న మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కౌంటరిచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీ కంటే తెలంగాణే ఎక్కువ అభివృద్ది జరిగిందని అనడంపైనా మంత్రి రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు, కేసీఆర్ చెప్పినట్లుగా ఏపీలో భూముల ధరలేమీ తగ్గలేదని... ఇప్పటికీ విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనుక్కోవచ్చని అన్నారు. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా వున్న హైదరాబాద్ నగరంలో లేని రేట్లు విశాఖలో వున్నాయన్నారు. కేవలం రాజకీయా లబ్ది కోసం పక్కరాష్ట్రాలను కించపర్చడం సరికాదని అమర్నాథ్ సూచించారు. 

తెలంగాణలో కేవలం హైదరాబాద్ ను చూపించి రాష్ట్రమంతా ఏదో అయిపోతోందని ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి అమర్నాథ్ పేర్కొన్నారు. ఇది తెలియని చంద్రబాబు తెలంగాణ భూములు ధరలు ఎపీలో కంటే ఎక్కువగా వున్నాయనడం... ఈ వ్యాఖ్యలను కేసీఆర్ ప్రచారంకోసం వాడుకోవడం జరిగిందన్నారు. అయినా చంద్రబాబు మాటల కేసీఆర్ నమ్మడం హాస్యాస్పదంగా వుందన్నారు. తోటి తెలుగు రాష్ట్రాన్ని , ప్రభుత్వాన్ని, ప్రాంతాలను కించపర్చేలా మాట్లాడటం తగదని... దయచేసి జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని తెలంగాణ నాయకులకు మంత్రి అమర్నాథ్ సూచించారు. 

ఇదిలావుంటే ఏపీ నుంచి జగన్ ను పంపించేందుకు 'హలో ఏపీ... బైబై వైసిపి' నినాదంతో జనసేన పార్టీ ఎన్నికలకు వెళుతుందన్న పవన్ వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. సీఎం జగన్‌ ని పంపించేద్దాం కాదు...ప్రజలు మిమ్మల్నే హైదరాబాద్‌ తరిమేస్తారని అన్నారు. రాష్ట్రంలో జరుగున్న అభివృద్ది, ప్రజా సంక్షేమాన్ని చూడలేకపోతున్న చంద్రబాబు ఒకపక్క, ఆయన దత్తపుత్రుడు మరోపక్క ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్నికలు అయిపోగానే పవన్ తో పాటు ఆయన దత్తతండ్రి చంద్రబాబు ఇద్దరూ మళ్లీ హైదరాబాద్‌లో దాక్కుంటారని ఐటీ మంత్రి అన్నారు.  

Read More  లొంగిపోను, నాపై పోటీకి దిగు: పవన్ కల్యాణ్‌పై ముద్రగడ మరో లేఖాస్త్రం
 
పవన్ కల్యాణ్ కు దత్తతండ్రితో సీట్ల కోసం, ప్యాకేజీల కోసం బేరమాడేందుకే సరిపోతుంది... ఇక ప్రజాసంక్షేమం, అభివృద్ది గురించి ఎప్పుడు తెలుసుకుంటారు అంటూ మంత్రి ఎద్దేవా చేసారు.  ఎప్పుడు ఏం మాట్లాడాలో చంద్రబాబు స్క్రిప్ట్‌ రాసిస్తే పవన్ వచ్చి అదే మాట్లాడి తిరిగి వెళ్ళిపోతారని అన్నారు. పవన్ ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థంకాదు.... ఓరోజు ఎమ్మెల్యేని చేయమంటాడు..మరో రోజు ముఖ్యమంత్రిని చేయమంటాడని అన్నారు. ఈసారి మనం గెలవలేం అని పవన్ అంటున్నాడు... నిజం చెప్పాలంటే ప్రజలే ఆయనను గెలిపించరని అమర్నాథ్ అన్నారు. 

ఇక తనకు వైసిపి నాయకులతో ప్రాణహాని వుందటున్న పవన్ వ్యాఖ్యలపైనా మంత్రి అమర్నాథ్ రియాక్ట్ అయ్యారు. ఈ రాష్ట్రంలో పవన్‌ కళ్యాణ్‌ అనే వ్యక్తికి ప్రాణహాని అనేది ఉంటే అది ఒక్క చంద్రబాబు వల్లనేనని అన్నారు. చంద్రబాబు తర్వాత ఒక వ్యక్తి ఫోకస్‌లోకి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎలిమినేట్‌ అవుతాడని... మాధవరెడ్ నుండి నందమూరి హరికృష్ణ వరకు ఇదే జరిగిందన్నారు. మాధవరెడ్డి నక్సలైట్ల దాడిలో, బాలయోగి హెలికాఫ్టర్‌ యాక్సిడెంట్‌లో, కారు ప్రమాదంలో ఎర్రంనాయుడు, లాల్‌జాన్‌బాషా, నందమూరి హరికృష్ణ మృతిచెందారని గుర్తుచేసారు. టిడిపిలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న సమయంలోనే వీరంతా అనుమానాస్పదంగా మరణించారని మంత్రి అన్నారు. ఇప్పుడు పవన్ ప్రాణహాని అంటున్నాడు... అది చంద్రబాబు వల్లేనని గుర్తించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు