లొంగిపోను, నాపై పోటీకి దిగు: పవన్ కల్యాణ్‌పై ముద్రగడ మరో లేఖాస్త్రం

Published : Jun 23, 2023, 09:33 AM ISTUpdated : Jun 23, 2023, 10:07 AM IST
లొంగిపోను, నాపై పోటీకి దిగు: పవన్ కల్యాణ్‌పై ముద్రగడ మరో లేఖాస్త్రం

సారాంశం

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కాపు నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను సంధించారు. ఇప్పటికే పవన్ విధానాలను విమర్శిస్తూ ఒక లేఖ రాసిన ముద్రగడ.. తాజాగా మరో లేఖలో పవన్‌పై విమర్శల దాడిని పెంచారు.  

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ టార్గెట్‌గా కాపు నేత ముద్రగడ పద్మనాభం మరో లేఖను సంధించారు. ఇప్పటికే పవన్ విధానాలను విమర్శిస్తూ ఒక లేఖ రాసిన ముద్రగడ.. తాజాగా మరో లేఖలో పవన్‌పై విమర్శల దాడిని పెంచారు.  పవన్ గురించి తాను ఎప్పుడూ ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఇవ్వలేదని.. అలాంటిది కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు తనను తిట్టడం తప్పో రైటో పవన్ గ్రహించుకోవాలని సూచించారు. 

పవన్ ఆయన అభిమానులతో తనను బండబూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తాను మెసేజ్‌లకు భయపడి లొంగిపోయేవాడిని కాదని అన్నారు. తనను తిట్టాల్సిన అవసరం పవన్‌కు, ఆయన అభిమానులకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. తానేం పవన్ దగ్గర నౌకరీ చేయడం లేదని అన్నారు. తనకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా? అని ప్రశ్నించారు. ‘‘మీకు తొత్తులుగా ఉండాలా.. మీకు, నాకు సంబంధం ఏమిటని?’’ అని పవన్‌ టార్గెట్‌గా ప్రశ్నలు సంధించారు. తనను ఏమన్నా పడతానని అనుకుంటున్నావా? అని ప్రశ్నించారు. 

కాపు మంత్రుల అభ్యర్థనపై 2016 నుంచి కాపు నేతలపై పెట్టిన కేసులను సీఎం జగన్ తీసేసిన విషయం పవన్‌కు తెలుసా? అని ప్రశ్నించారు. దమ్ముంటే.. పవన్ తనపై పిఠాపురంలో పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తీవ్రవాయుగుండం తీరం దాటేది ఇక్కడే.. ఈ రెండ్రోజులూ మూడు తెలుగు జిల్లాల్లో వర్షాలే వర్షాలు
Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu