
బెంగళూరులో స్థిర పడిన తెలుగు పారిశ్రామిక వేత్త పరుచూరి సురేంద్రనాథ్(60) హత్యకు గురయ్యారు. పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడిగా, అనేక సేవాకర్యాక్రమాల నిర్వహించి ఆయన మంచి పేరు సంపాదించారు. పర్చూరి గ్రూప్ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత ఆయన. పోలీలు చెబుతున్న సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి ఆఫీసు నుంచి ఇంటికి వస్తుడగా బైక్ మీద వచ్చిన ఇద్దరు దుండగులు వెంబడించి పలు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆయన గుంటూరు జిల్లాకు చెందిన వ్యాపారి. 15 ఏళ్లుగా సురేంద్రనాథ్ బెంగళూరులోనే నివసిస్తున్నారు.
నిజానికి ఆయన ఎప్పుడూ గట్టి భద్రత మధ్య ఉంటారు. అయినా సరే, ఆయన వాహనాన్ని వెంబడించి, సంజయ్‌నగర్‌లోని సురేంద్రనాథ్ నివాసం వద్దే అయనపై దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడ్డ ఆయనను రామయ్య అసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం నాడు సురేంద్రనాథ్ మృతి చెందారు. వ్యాపార స్పర్థలే ఈ హత్యకు కారణమయి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన సిబ్బంది వెంట లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. ఈ దాడిలో ఆయనగురించి తెలిపిన వారి ప్రమేయం తప్పక ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.