హైకోర్టులో జగన్ సర్కార్ కు చుక్కెదురు: పీపీఏల పున:సమీక్షకు బ్రేక్

By Nagaraju penumalaFirst Published Jul 25, 2019, 3:21 PM IST
Highlights

ఈ పరిణామాల నేపథ్యంలో 40 ప్రైవేట్ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జీవో 63ను రద్దు చేయాలని కోరింది. ఆయా సంస్థలు ఇప్పటికే సుమారు 15 పిటీషన్లను దాఖలు చేయగా వాటిపై జస్టిస్ ఎం.గంగారావ్ విచారణ చేపట్టారు. తీర్పును ఆగష్టు 22కు వాయిదా వేస్తూ విచారణ వాయిదా వేసింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. పీపీఏల పున:సమీక్షకు సంబంధించి ఏపీఎస్పీడీసీఎల్ రాసిన లేఖలను నాలుగు వారాల పాటు సస్పెండ్ చేసింది హైకోర్టు.  అలాగే పీపీఏల పున: సమీక్షకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీపై నాలుగు వారాలపాటు స్టే విధించింది. 

పవన, సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పీపీఏల పున:సమీక్షకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిపుణుల కమిటీని నియమిస్తూ జీవో జారీ చేసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో 40 ప్రైవేట్ విద్యుత్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. పీపీఏలపై సమీక్ష కోసం ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీని నియమిస్తూ విడుదల చేసిన జీవో 63ను రద్దు చేయాలని కోరాయి. కాంపిటేటివ్ పద్దతిలోనే తాము బిడ్డింగ్ దక్కించుకున్నట్లు సంస్థలు స్పష్టం చేశాయి. 

ఏపీ రెగ్యులరేటరీ, ఏపీ ఈఆర్సీ ఆమోదంతోనే బిడ్డింగ్ డిస్కంలతో ఒప్పందం చేసుకున్నామని విద్యుత్ పంపిణీ సంస్థలు స్పష్టం చేశాయి. గతంలో చెల్లించిన బిల్లులను పున: సమీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం ఏకపక్షమని విద్యుత్ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. 

బిల్లులను పున:సమీక్షించే అధికారం కేవలం డిస్కింలకు మాత్రమే ఉంటుందని విద్యుత్ పంపిణీ సంస్థలు హైకోర్టులో తమ వాదనలు వినిపించాయి. 40 విద్యుత్ పంపిణీ సంస్థలు సుమారు 15 పిటీషన్లను దాఖలు చేయగా వాటిపై జస్టిస్ ఎం.గంగారావ్ విచారణ చేపట్టారు. 

గురువారం ఉదయం నుంచే ఈ పిటీషన్లపై వాదనలు జరిగాయి. ఇరువాదనలు విన్న హైకోర్టు పీపీఏల పున:సమీక్షించుకోవాలన్న ప్రభుత్వ తీరు ఆక్షేపనీయంగా ఉందంటూ హైకోర్టు అభిప్రాయపడింది. తీర్పును ఆగష్టు 22కు వాయిదా వేస్తూ విచారణ వాయిదా వేసింది.

ఈ వార్తలు కూడా చదవండి

జగన్ సర్కార్ కు అప్పిలేట్ ట్రిబ్యునల్ షాక్

click me!