జగన్ సర్కార్‌కి షాక్: జీవో నెంబర్ 35 రద్దు, పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు

Published : Dec 14, 2021, 04:31 PM ISTUpdated : Dec 14, 2021, 04:56 PM IST
జగన్ సర్కార్‌కి షాక్: జీవో నెంబర్ 35 రద్దు, పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు

సారాంశం

సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 35 నెంబర్ జీవోను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు కోర్టు కొట్టివేసింది. పాత విధానంలోనే సినిమా టికెట్ల ధరలు కొనసాగనున్నాయి.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో సినిమా టికెట్ల రేట్లు తగ్గిసూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 35ను AP High Court మంగళవారం నాడు రద్దు చేసింది. సినిమా టికెట్ల రేట్లను పెంచుకొనే అవకాశాన్ని డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఇటీవల AP Assembly సమావేశాల్లో థియేటర్లలో టికెట్ల ను Online లో విక్రయించాలని చట్ట సవరణ చేసింది. నిర్ణయించిన ధరలకే Cinema Tickets  అమ్మాలని బెనిఫిట్స్ షోస్ వేయకూడదని కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.  టికెట్ ధరలు తగ్గింపుపై సినీ పరిశ్రమలో పలువురు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ విషయమై  పలువురు సినీ ప్రముఖులు ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై తమ అభిప్రాయాలను బహిరంగంగా చెప్పారు. 

ఏపీ సర్కార్ తీసుకొన్ని నిర్ణయం సినిమా నిర్మాతలపై తీవ్రంగా పడనుంది. సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయే అవకాశం ఉందని సినీ పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఏదైనా సినిమా విడుదలైతే వారం రోజుల్లోనే ఆ సినిమా టికెట్ ధరలను పెంచుకొనేందుకు అవకాశం లేకపోతే  నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు  Tollywood సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.Balakrishna నటించిన అఖండ సినిమా విడుదలకు ఒక్క రోజు ముందే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది.

also read:ఏపీలో టికెట్‌ రేట్లు కప్పు టీ కంటే తక్కువ..కొత్త రేట్లు ఇవే.. నెటిజన్ల ట్రోల్స్.. తెలంగాణ గ్రీన్‌ సిగ్నల్‌

అయితే సినిమా టికెట్ల ధరలను తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 35 నెంబర్ జీవోను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.  కొత్త సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్స్ రేట్స్ పెంచుకునే అవకాశం థియేటర్ యజమానులకు ఉంటుందని పిటిషనర్లు పేర్కోన్నారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. థియేటర్ల యాజామాన్యాల తరపున సీనియర్ లాయర్లు ఆదినారాయణ రావు, దుర్గాప్రసాద్ వాదనలు వినిపించారు. టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదని తెలిపారు. పిటిషనర్ల తరపు న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం35ను సస్పెండ్ చేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే సగటు ప్రేక్షకుడికి వినోదం అందించే సినిమా టికెట్ల ధరలను  ఇష్టారీతిలో  పెంచుకొనే విధానానికి తాము వ్యతిరేకమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. సామాన్యుడికి అందుబాటులో ధరలు తీసుకొచ్చేందుకు వీలుగా సినిమా టికెట్ల ధరలను తగ్గించినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  అయితే టికెట్ల ధరలను తగ్గిస్తూ తీసుకొన్న నిర్ణయాన్ని నిరసిస్తూ దాఖలైన పిటిషన్ పై ఏపీ హైకోర్టు  ఇవాళ కీలక నిర్ణయం తీసుకొంది. అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసే అవకాశం లేకపోలేదు. 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్