తుది అంకానికి అమరావతి జేఏసీ పాదయాత్ర: 17న తిరుపతిలో సభకు ప్లాన్

Published : Dec 14, 2021, 03:45 PM IST
తుది అంకానికి అమరావతి జేఏసీ పాదయాత్ర: 17న తిరుపతిలో సభకు ప్లాన్

సారాంశం

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతుల మహా పాదయాత్ర తిరుపతిలో మంగళవారం నాడు ముగియనుంది. ఈ పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని ఈ నెల 17న తిరుపతిలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

తిరుపతి: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన  మహా పాదయాత్ర చివరి అంకానికి చేరుకొంది. పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని  Amaravati Jac ఈ ఏడాది నవంబర్ 1న పాదయాత్రను చేపట్టారు. ఇవాళ Tirupati లో పాదయాత్ర ముగియనుంది. ఇవాళ, రేపు రైతులు Tirumala శ్రీవారిని దర్శించుకొంటారు. 
ఈ నెల 17న పాదయాత్ర ముగింపును పురస్కరించుకొని  తిరుపతిలో బహిరంగసభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని  అమరావతి జేఏసీ  Ap High court లో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు అనుమతితో అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో రైతులు మహా పాదయాత్రను చేపట్టారు. పలు జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతూ తిరుపతికి చేరుకొంది. సుమారు 500 కి.మీ పాదయాత్ర సాగింది. 

మూడు రాజధానులే ముద్దంటూ ప్లెక్సీలు.. చించేసిన అమరావతి జేఏసీ

తిరుపతిలో మూడు రాజధానులే ముద్దంటూ పలు చోట్ల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను  అమరావతి జేఏసీ ప్రతినిధులు చించేశారు. మూడు రాజధానులు వద్దు అమరావతే ముద్దంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల కావాలనుకొనే వారు ధైర్యంగా  బయటకు రావాలని అమరావతి జేఏసీ కోరింది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్