ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు సోమవారం నాడు తీర్పును రిజర్వ్ చేసింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. ఇవాళ ఉదయం ఈ పిటిషన్ పై జరిగిన వాదనల్లో చంద్రబాబు తరపు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వర్చువల్ గా తన వాదనలను విన్పించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై 50 రోజులు అవుతుందని లూథ్రా హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మరోవైపు చంద్రబాబుకు కంటి పరీక్ష నిర్వహించడం, ఆరోగ్య సమస్యలపై దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై విచారణను ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు ఏపీ హైకోర్టు ప్రారంభించింది.
undefined
చంద్రబాబు కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన అవసరాన్ని వైద్యులు చెబుతున్న విషయాన్ని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. మరో వైపు చంద్రబాబు ఆరోగ్య సమస్యలను కూడ హైకోర్టు ముందు ప్రస్తావించారు. ఈ కారణాలతో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్న విషయాన్ని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఇరు వర్గాలు తమ వాదనలు విన్పించాయి. ఈ వాదనలు విన్న తర్వాత తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.
also read:చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్: విచారణ నుండి తప్పుకున్న జడ్జి
ఈ నెల 27వ తేదీన ఏపీ హైకోర్టులో ఈ పిటిషన్ పై విచారణ ప్రారంభమైంది. అయితే ఈ పిటిషన్ పై విచారణ నుండి ఏపీ హైకోర్టు జడ్జి జ్యోతిర్మయి తప్పుకున్నారు. అంతేకాదు పిటిషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఏపీ హైకోర్టు ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు. అరెస్టైన రోజు నుండి చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు.