విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పరామర్శించారు.
విజయనగరం: విజయనగరం: జిల్లాలోని కంటకాపల్లిలో వద్ద జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన వారిని ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు మధ్యాహ్నం పరామర్శించారు. ఆదివారంనాడు రాత్రి విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని విశాఖపట్టణం, విజయనగరం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం తాడేపల్లిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విజయనగరం చేరుకున్నారు. విజయనగరం ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. రైలు ప్రమాదం గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహయం అందించాలని సీఎం జగన్ వైద్యులను ఆదేశించారు. విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద ఆదివారం నాడు రాత్రి రైలు ప్రమాదం జరిగింది.
undefined
విశాఖపట్టణం నుండి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే అదే సమయంలో ఈ రైలు వెనుకే వస్తున్న విశాఖపట్టణం-రాయగడ రైలు ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. విషయం తెలిసిన వెంటనే మంత్రి బొత్స సత్యనారాయణ, రైల్వే శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పట్టాల పునరుద్దరణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు.ఈ ప్రమాదం కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు.