రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీకి ఏపీ హైకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది..
అమరావతి:రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీకి ఏపీ హైకోర్టు సోమవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.రేషన్ వాహనాల రంగులు మార్చాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది..
ఏపీలో ఇంటింటికి రేషన్ పథకాన్ని గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు సాగుతున్న నేపథ్యంలో ఇంటింటికి రేషన్ పథకాన్ని నిలిపివేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను పౌరసరఫరాల శాఖ సవాల్ చేసింది.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇంటింటికి రేషన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్దరించాలని నిర్ణయం తీసుకొంది.హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇక నుండి గ్రామీణ ప్రాంతాల్లో కూడ ఇంటింటికి రేషన్ పథకాన్ని అమలు చేయనున్నారు.