మద్యం విక్రయాలపై ఈ నెల 13వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. మద్యం విక్రయాలతో లిక్కర్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని మాతృభూమి పౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అమరావతి:మద్యం విక్రయాలపై ఈ నెల 13వ తేదీ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. మద్యం విక్రయాలతో లిక్కర్ షాపుల వద్ద భౌతిక దూరం పాటించడం లేదని మాతృభూమి పౌండేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
సోమవారం నాడు ఈ పిటిషన్ ను వీడియో కాన్పరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని పిటిషనర్ ఆరోపించారు.
undefined
also read:పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు
ఇలాంటి సమయంలో మధ్యనిషేధిస్తే ప్రయోజనం ఉంటుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయమై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.
అయితే కౌంటర్ దాఖలు చేయడానికి మాత్రం సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. అయితే ఈ విషయమై ఈ నెల 13వ తేదీ వరకు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఈ నెల 5వ తేదీన ఏపీ రాష్ట్రంలో మద్యం విక్రయాలను ప్రారంభించింది. మద్యం విక్రయాలు ప్రారంభించిన రోజు 25 శాతం ధరలను పెంచింది సర్కార్. మరునాడు మరో 50 శాతం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే.