ఏపీలో కరోనా విజృంభణ: 2 వేలు దాటిన పాజిటివ్ కేసులు, 45 మంది మృతి

Published : May 11, 2020, 12:10 PM ISTUpdated : May 11, 2020, 12:11 PM IST
ఏపీలో కరోనా విజృంభణ: 2 వేలు దాటిన పాజిటివ్ కేసులు, 45 మంది మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 2 వేల మార్కును దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 38 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు కోవిడ్ -19తో 45 మంది మరణించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి కావడం లేదు. తాజాగా రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 2 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 2018కి చేరుకుంది. ఇప్పటి వరకు ఏపీలో 45 మంది కరోనా వైరస్ తో మరణించారు.

గత 24 గంటల్లో 998 మంది చికిత్స పొంది డిశ్చార్జీ కాగా, 975 మంది ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా అనంతపురం జిల్లాలో 8, చిత్తూరు జిల్లాలో 9, గుంటూరు జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 3, నెల్లూరు జిల్లాలో 1 కేసుల, విశాఖపట్నం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి.  కర్నూలు జిల్లాలో 9 కేసులు నమోదయ్యాయి. 

కర్నూలు జిల్లా 575 కేసులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు జిల్లా 387 కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది.  తూర్పు గోదావరి, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గత 24 గంటల్లో కేసులేమీ నమోదు కాలేదు. 

ఇదిలావుంటే, ఇప్పటి వరకు రాష్ట్రంలో మరణించిన 45 మందిలో 16 మంది కర్నూలు జిల్లాలో, 13 మంది కృష్ణా జిల్లాలో మరణించారు. గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. అనంతపురం జిల్లాలో నలుగురు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. నెల్లూరు జిల్లాలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 

జిల్లాలవారీగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 115
చిత్తూరు 121
తూర్పు గోదావరి 46
గుంటూరు 387
కడప 97
కృష్ణా 342
కర్నూలు 575
నెల్లూరు 102
ప్రకాశం 63
శ్రీకాకుళం 5
విశాఖపట్నం 66
విజయనగరం 4
పశ్చిమ గోదావరి 68

PREV
click me!

Recommended Stories

Nara Lokesh Speech: బెంగళూరులో జరిగిన సదస్సులో నారా లోకేష్ పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
వైఎస్ఆర్ మరణం వెనుక ఉన్నది జగనే అని చెప్పింది బొత్స: పయ్యావుల కేశవ్| Asianet News Telugu