విశాఖలో భారీగా స్టైరిన్ నిల్వలు: నౌకల ద్వారా తరలింపుకు నిర్ణయం

Published : May 11, 2020, 12:20 PM IST
విశాఖలో భారీగా స్టైరిన్ నిల్వలు: నౌకల ద్వారా తరలింపుకు నిర్ణయం

సారాంశం

ఎల్జీ పాలీమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో  విశాఖపట్టణంలోని పలు పరిశ్రమలో నిల్వ ఉన్న స్టైరిన్ గ్యాస్ నిల్వలను అధికారులు సేకరిస్తున్నారు. ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో ఈ నెల 7వ తేదీన స్టైరిన్ గ్యాస్ లీకైంది.దీంతో  12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 


విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో  విశాఖపట్టణంలోని పలు పరిశ్రమలో నిల్వ ఉన్న స్టైరిన్ గ్యాస్ నిల్వలను అధికారులు సేకరిస్తున్నారు.
ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో ఈ నెల 7వ తేదీన స్టైరిన్ గ్యాస్ లీకైంది.దీంతో  12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 

అస్వస్థతకు గురైన వారు ప్రస్తుతం కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  విశాఖపట్టణంలో పలు రసాయన పరిశ్రమలు ఉన్నాయి.  ఈ పరిశ్రమలు స్టైరిన్ గ్యాస్ ను వినియోగిస్తున్నాయి. 

also read:విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్: గ్రీష్మ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లింపు

విశాఖలో స్టైరిన్ గ్యాస్ నిల్వలపై ప్రత్యేక అధికారుల బృందం సమాచారాన్ని సేకరించింది. విశాఖలోని పలు పరిశ్రమల్లో సుమారు 9 వేల టన్నుల స్టైరిన్ గ్యాస్ నిల్వలు ఉన్నట్టుగా అధికారుల బృందం గుర్తించింది. 

స్టైరిన్ గ్యాస్ నిల్వలను తిరిగి దిగుమతి చేసుకొన్న కంపెనీలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

also read:పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

సముద్ర మార్గంలో స్టైరిన్ గ్యాస్ నిల్వలను దిగుమతి చేసుకొన్న దేశాలకు తరలించనున్నారు.  స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో విశాఖలో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu