ప్రభుత్వ జీవోలు రహస్యమా...! జగన్ సర్కార్ తీరుపై హైకోర్టు ఆశ్చర్యం

By Arun Kumar PFirst Published Sep 13, 2021, 2:21 PM IST
Highlights

ప్రభుత్వ జీవోలను ఆన్ లైన్ లో కాకుండా ఆఫ్ లైన్ విడుదల చేయాలన్న వైసిపి సర్కార్ నిర్ణయంపై ఏపీ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది.   

అమరావతి: ఇకపై అధికారికంగా జారీచేసే జీవోలను ఆన్ లైన్ లో వుంచకూడదన్న వైసిపి సర్కార్ నిర్ణయంపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలుచేసిన తర్వాత ప్రభుత్వం జీవో 100ను విడుదల చేసిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ జీవో 100లోనూ సీక్రెట్, టాప్ సీక్రెట్, కాన్ఫిడెన్షియల్ పేరిట జీవోలను మళ్లీ విడుదల చేయకుండా అడ్డుకుంటున్నారని న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన జీవో నంబరు 100 సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4, 8కు జీవో విరుద్ధంగా ఉందని న్యాయవాదులు ఇంద్రనీల్ బాబు, యలమంజుల బాలాజీ కోర్టుకు వెల్లడించారు. 

రహస్యం పేరిట జీవోలను పెట్టకపోవడం ఏంటని హైకోర్టు ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పిటిషనర్లు తాజా పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ప్రభుత్వం కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

read more  జీవోలు ఆన్‌లైన్‌లోనే ఉంచాలి, లేదంటే కోర్టుకు: ఏపీ గవర్నర్‌కి టీడీపీ ఫిర్యాదు

జీవోలను ప్రభుత్వ డొమైన్‌లో అప్‌లోడ్  చేయకూడదని ఏపీ ప్రభుత్వం మొదట నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు జీవోఐఆర్ వెబ్‌సైట్ ను కూడా నిలిపివేసింది ఏపీ సర్కార్. అయితే దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చే చర్యలు తీసుకుంది జగన్ సర్కార్. ఈ గెజిట్ ద్వారా ప్రభుత్వ జీవోలను అందుబాటులోకి తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

 సమాచార హక్కు చట్టం ప్రయోజనాలకు భంగం కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ గెజిట్‌లో ప్రభుత్వ ఉత్తర్వులను ఉంచాలని నిర్ణయం తీసుకొన్నారు. అవసరం లేని వ్యక్తిగత సమాచారం, తక్కువ మొత్తంలోని ఖర్చులు, ఆదాయం, సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను ఇందులో పొందుపర్చబోమని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేశారు. దీనిపైనే తాజాగా హైకోర్టులో పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయస్థానం కూడా జీవోలను రహస్యంగా వుంచడం ఏంటని ఆశ్యర్యం వ్యక్తం చేసింది. 

click me!