జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు... రాజధాని రైతులకు ఊరట

Arun Kumar P   | Asianet News
Published : Sep 13, 2021, 01:50 PM ISTUpdated : Sep 13, 2021, 01:54 PM IST
జగన్ సర్కార్ కు హైకోర్టులో చుక్కెదురు... రాజధాని రైతులకు ఊరట

సారాంశం

జగన్ సర్కారుకు హైకోర్టులో మరోసారి చుక్కెదురయ్యింది. రాజధాని అసైన్స్ రైతుల ప్లాట్ల విషయంలో తీసుకువచ్చిన జీవో నెంబర్ 316పై స్టేటస్ కో విధించింది న్యాయస్థానం.

అమరావతి: రాజధాని రైతులకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. అసైన్డ్ రైతుల భూముల క్రయ, విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో 316పై స్టేటస్ కో ఇచ్చింది ఏపీ హైకోర్టు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారచేసిన 316జీవో రాజధాని రైతులకు అన్యాయం చేసేలా వుందంటూ న్యాయవాది ఇంద్రనీల్‍బాబు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. 

ఈ సందర్భంగా న్యాయవాది ఇంద్రనీల్ తన వాదనను కోర్టుముందుంచారు. నోటీసులు ఇవ్వకుండానే భూములు కోల్పోయిన రైతులకు కేటాయించిన ప్లాట్‍లను రద్దు చేస్తూ 316జీవోను ప్రభుత్వం ఇచ్చిందంటూ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ తర్వాత ప్రభుత్వ తరపు వాదనలు కూడా విన్న న్యాయస్థానం స్టేటస్ కో విధించింది. ఈ జీవో అమలుకు సంబంధించి తదనంతర ప్రక్రియ చేపట్టవద్దని ఏఎంఆర్డీఏకు ఏపీ హైకోర్టు ఆదేశించింది. 

read more  ఏపీ హైకోర్టు తీర్పుపై స్టేను నిరాకరించిన సుప్రీంకోర్టు...

గతంలో టిడిపి ప్రభుత్వం రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతులకు ప్లాట్లు ఇచ్చింది. ఈ రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకుంటూ వైసిపి సర్కార్ జీవో-316 జారీ చేసింది. ఈ జీవోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా వాదోపవాదాలు విన్న న్యాయస్థానం ఈ జీవో అమలుపై తీసుకుంటున్న చర్యలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఊరట లభించింది.  

అమరావతి నిర్మాణంలో భాగంగా జరిగిన భూసమీకరణలో అసైన్డ్ భూములను కోల్పోయిన రైతులకు  గత టిడిపి ప్రభుత్వం ప్లాట్లను ఇచ్చింది. ఇందుకోసం జీవో నంబర్ 41ను విడుదలచేసింది. భూములను కోల్పోయిన అసైన్డ్ రైతులు అవసరాల కోసం ఆ ప్లాట్లను విక్రయించుకునే వెసులుబాటు కూడా కల్పించింది చంద్రబాబు సర్కార్. 

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిబంధనలకు విరుద్దంగా అసైన్డ్ భూము లావాదేవీలు జరిగాయంటూ రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా జీవో నంబర్ 41ను రద్దు చేస్తూ జీవో నంబర్ 316ను జారీ చేసింది. దీంతో ప్రభుత్వ చర్యలను వ్యతిరేకిస్తూ అసైన్డ్ రైతులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపైనే ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి చర్యలు నిలిపివేస్తూ

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్