జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. వినాయక చవితి వేడుకలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, కానీ

Siva Kodati |  
Published : Sep 08, 2021, 05:58 PM IST
జగన్‌ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. వినాయక చవితి వేడుకలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్, కానీ

సారాంశం

వినాయక చవితి వేడుకలకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.  ఆర్టికల్‌ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని.. దానిని నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

వినాయక చవితి వేడుకలకు ఏపీ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. వినాయక చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషిన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరు పక్షాల వాదనలు  విన్న అనంతరం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వినాయక పూజలకు అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రైవేటు స్థలాల్లో గణేష్‌ ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఆర్టికల్‌ 26తో ప్రజలకు మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు అధికారం ఉంటుందని.. దానిని నిరోధించే హక్కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. కొవిడ్‌ నిబంధనల మేరకు పూజలు చేసుకోవాలని ప్రజలకు సూచించింది. అలాగే ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు నిర్వహించుకోవచ్చునని వెల్లడించింది. ఇదే సమయంలో పబ్లిక్ స్థలాల్లో ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించింది. కేవలం ప్రైవేటు స్థలాల్లో మాత్రమే విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని ఆదేశాలిచ్చింది.  


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు