జగన్ సర్కార్ సంచలనం .. సినిమా టికెట్ల కోసం వెబ్‌సైట్, ఇక ప్రభుత్వం చేతుల్లోకి బుకింగ్

By Siva KodatiFirst Published Sep 8, 2021, 5:14 PM IST
Highlights

సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లుగా  తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. 

సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏపీ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడానికి విధివిధానాలను ఖరారు చేస్తున్నట్లుగా  తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా ఏపీ ప్రభుత్వం నియమించినట్లుగా తెలుస్తోంది. హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో  8 మంది ఉన్నతాధికారులతో కమిటీని కూడా నియమించారు. రైల్వే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ తరహాలోనే వెబ్‌సైట్‌ను తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. 

కరోనా కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. నిబంధనల మేరకు చిత్రీకరణలు జరుగుతున్నా, పెద్ద సినిమాలు థియేటర్‌లో విడుదలయ్యే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. తెలంగాణ థియేటర్స్‌ పూర్తిగా అందుబాటులోకి వచ్చినా, ఏపీలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయి. దీంతో నిర్మాతలు, థియేటర్స్‌ యజమానులు, పంపిణీదారులు ఏదో రూపంలో నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.


 

click me!