అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు: ఏసీబీ కోర్టులో చంద్రబాబు పీటీ వారంట్ పై స్టే నవంబర్ 7 వరకు పొడిగింపు

By narsimha lode  |  First Published Oct 18, 2023, 1:23 PM IST

అమరావతి ఇన్నర్ రింగ్  రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై విచారణ  వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.


అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను  ఈ ఏడాది నవంబర్  7వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఏసీబీ కోర్టులో  పీటీవారంట్ పై  స్టే ను నవంబర్ 7వ తేదీకి పొడిగించింది ఏపీ హైకోర్టు.  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో  ముందస్తు బెయిల్ కోరుతూ  ఏపీ హైకోర్టులో  పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై బుధవారంనాడు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.  సుప్రీంకోర్టులో  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్  చేసిన విషయాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టు దృష్టికి తెచ్చారు. తమకు అనుకూలంగా తీర్పు వస్తే ఈ కేసుకు కూడ 17 ఏ వర్తిస్తుందని కోర్టుకు చంద్రబాబు తరపు న్యాయవాదులు తెలిపారు. దీంతో విచారణను నవంబర్ 7వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, అంగళ్లు కేసుల్లో  ముందస్తు బెయిళ్లు కోరుతూ చంద్రబాబు నాయుడు ఏపీ హైకోర్టులో ఈ నెల 11న పిటిషన్లు దాఖలు చేశారు.  అంగళ్లు కేసులో ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  చంద్రబాబుకు  ముందస్తు బెయిల్ మంజూరు చేసిన  విషయం తెలిసిందే.

Latest Videos

undefined

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును ఈ నెల  16వ తేదీ వరకు  అరెస్ట్ చేయవద్దని ఏపీ హైకోర్టు ఈ నెల  11న ఆదేశించింది.  ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు విచారించింది.  చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణను  నవంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. నవంబర్ 7వ తేదీ వరకు ఏసీబీ కోర్టులోని పీటీ వారంట్లపై స్టేను పొడిగిస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ ను తమ వారికి లబ్ది కలిగేలా  మార్చారని  ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణపై  కేసులు నమోదు చేశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  ఈ ఏడాది సెప్టెంబర్ 9న  ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైలులో  ఉన్నారు.

also read::రిమాండ్ సమయంలో బాబు పేరు చేర్చారు: స్కిల్ కేసులో సుప్రీంలో చంద్రబాబు న్యాయవాది సాల్వే

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టైన తర్వాత ఏపీ ఫైబర్ నెట్ కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ అధికారులు పీటీ వారంట్లు దాఖలు చేశారు. ఏపీ ఫైబర్ నెట్ కేసులో సీఐడీ దాఖలు చేసిన  పీటీ వారంట్ కు గత వారంలో ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపింది. ఈ విషయమై సుప్రీంకోర్టులో  చంద్రబాబు సవాల్ చేసిన విషయం తెలిసిందే

click me!