పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి:మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య పిటిషన్ పై పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం

Published : Oct 18, 2023, 01:05 PM IST
 పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి:మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య పిటిషన్ పై పోలీసులకు  ఏపీ హైకోర్టు ఆదేశం

సారాంశం

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు  వాయిదా వేసింది. 


అమరావతి: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ దాఖలు చేసిన పిటిషన్ పై  విచారణను  వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. దసరా సెలవుల తర్వాత  ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. 

మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అక్రమంగా నిర్భంధించారని  ఆయన భార్య నీలిమ  ఏపీ హైకోర్టులో  హెబియస్ కార్పస్ పిటిషన్ ను  దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ తరపున  దమ్మాలపాటి శ్రీనివాస్ ఏపీ హైకోర్టులో వాదనలు విన్పించారు. కొన్ని గంటల పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్రను  పోలీసులు నిర్బంధించారని  శ్రీనివాస్ కోర్టులో వాదించారు.

 మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై  కేసు నమోదు చేసినట్టుగా  ప్రభుత్వ తరపు న్యాయవాది  హైకోర్టుకు తెలిపారు. రవీంద్రకు 151  సీఆర్‌పీసీ కింద  నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా  నిరాకరించారని  హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. పెద్ద నేరాలకు మాత్రమే 151 నోటీసు ఇవ్వాలి కదా  అని  ఏపీ హైకోర్టు  ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది.

also read:నా భర్తను అక్రమంగా నిర్బంధించారు: ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర భార్య నీలిమ పిటిషన్‌పై నేడు విచారణ

ఈ విషయమై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులనుఏపీ హైకోర్టు ఆదేశించింది.దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది.  ఈ పిటిషన్ పై విచారణను  వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

Rain Alert : తెలుగు ప్రజలారా బిఅలర్ట్.. పిడుగులు, ఈదురుగాలుల వర్షాలతో ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం
Seediri Appalaraju Arrest: అప్పలరాజు దెబ్బకు జగన్ కొంప కొల్లేరు | Asianet News Telugu