వీలైతే సహకరించండి.. లేదంటే అడ్డుతగలకండి: బాబుపై ఆళ్లనాని ఫైర్

Siva Kodati |  
Published : Mar 24, 2020, 03:07 PM IST
వీలైతే సహకరించండి.. లేదంటే అడ్డుతగలకండి: బాబుపై ఆళ్లనాని ఫైర్

సారాంశం

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీలైతే ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని.. లేదంటే అడ్డు తగిలే కార్యక్రమాలు చేపట్టవద్దని ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు.

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కరోనా వ్యాప్తికి సంబంధించి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వీలైతే ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వానికి సహకరించాలని.. లేదంటే అడ్డు తగిలే కార్యక్రమాలు చేపట్టవద్దని ఆళ్లనాని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు సూచనలను ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకుంటున్నామని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో 14,038 మంది విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారని తెలిపారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని. వీరిలో 28 రోజుల పరిశీలన సమయం పూర్తి చేసుకున్నవారు 2,426 మంది ఉన్నట్లు చెప్పారు.

Also Read:విమర్శలకు సమయమా, అసెంబ్లీ సమావేశాలపై ఇలా..: జగన్ పై బాబు

మళ్లీ వీరిలో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య 11,526 అని, ఆసుపత్రిలో ఉన్న వారి సంఖ్య 86 మంది అని చెప్పారు. ఇప్పటి వరకు 280 మంది కరోనా అనుమానితులు ఉన్నారని వీరిలో నెగిటివ్ వచ్చిన వారు 168, రిజల్ట్ రావాల్సిన వారి సంఖ్య 45.

విశాఖపట్నం జిల్లాలో 3 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, అంతకుముందు నుంచి అధికారులు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని నాని చెప్పారు. విశాఖలో ఉన్న పరిస్ధితులు సమీక్షించేందుకు గాను తనను, అవంతి శ్రీనివాస్, కన్నబాబును ముఖ్యమంత్రి నియమించారని మంత్రి చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్ అమలు చేస్తున్నప్పటికీ విశాఖ ప్రజల నుంచి సరైన సహకారం అందడం లేదని ఆళ్లనాని తెలిపారు. అధికారులు, మెడికల్ సిబ్బంది కుటుంబాలను పక్కనబెట్టి మరీ ప్రజల కోసం పోరాడుతున్నారని కానీ జనం స్పందించడ లేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:చంద్రబాబుకు షాక్: అమరావతి భూములపై సీబీఐ విచారణ

కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో దేశంలోని అన్ని ప్రభుత్వాలు లాక్‌డౌన్ కార్యక్రమాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని ఆళ్లనాని గుర్తుచేశారు. ఈ నెల 31 వరకు ఎన్ని పనులు ఉన్నా ప్రజలు ఇళ్లలోంచి బయటకు రాకుండా ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి కోరారు.

విశాఖలో చికిత్స నిమిత్తం విమ్స్‌లో ఒక ఐసీయూ, కేజీహెచ్‌లోనూ మరో 200 బెడ్లను ఏర్పాటు చేస్తున్నామని ఆళ్లనాని తెలిపారు. విశాఖ వాసులు వైరస్ రెండో దశలోకి చేరుకుంటున్నారని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Anam Rama Narayana Reddy:థ్యాంక్ యూ సార్.. పవన్ కళ్యాణ్ పై మంత్రి ఆనం ప్రశంసలు| Asianet News Telugu
Atchennaidu Appreciated Pawan Kalyan: ఇవి మినీ కలెక్టరేట్లలా పనిచేస్తాయి | Asianet News Telugu