ఏపీలో అగ్రవర్ణ పేదలకు ప్రత్యేక సంక్షేమ శాఖ.. జీవో జారీ చేసిన జగన్ సర్కార్

By Siva Kodati  |  First Published Nov 3, 2021, 2:56 PM IST

అగ్రవర్ణాల్లోని పేదల కోసం (upper caste poor ) ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ ( ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. 


అగ్రవర్ణాల్లోని పేదల కోసం (upper caste poor ) ఏపీ ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. వారి సంక్షేమం కోసం ‘ఈడబ్ల్యూఎస్ ( ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు)’ శాఖను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ వర్గాల కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసే విషయంపై రాష్ట్ర కేబినెట్ (ap cabinet) కొన్ని రోజుల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈడబ్ల్యూఎస్ (EWS) శాఖను ఏర్పాటు చేస్తూ సాధారణ పరిపాలన విభాగం జీవో ఇచ్చింది.

Also Read:అమ్మఒడి పథకానికి 75 శాతం హాజరు తప్పనిసరి.. మూడు శాఖల్లో పోస్టుల భర్తీ: పేర్ని నాని

Latest Videos

ఈ శాఖ పరిధిలోకి కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కాపు, ఆర్యవైశ్య కార్పొరేషన్లను తీసుకువచ్చారు. అలాగే జైనులు, సిక్కుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో రెండు జీవోలను జారీ చేసింది. ఏపీలో అగ్రవర్ణాల్లో ((EWS reservations)  పేదలకు 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుతం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆర్ధికంగా వెనుకబడిన అగ్రవర్ణ వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ దక్కనుంది. రూ.8 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారికి రిజర్వేషన్లు వర్తించనున్నాయి.

click me!