హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌ విజయం.. ఏపీ రాజకీయాలపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Nov 3, 2021, 2:33 PM IST
Highlights

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఘన విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ సాధించిన విజ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ ఏపీ (ap bjp) అధ్య‌క్షుడు సోము వీర్రాజు (somu verraju) కీలక వ్యాఖ్య‌లు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న క‌రీంన‌గ‌ర్ (karimnagar district) జిల్లా హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఘన విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌పై బీజేపీ సాధించిన విజ‌యాన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ ఏపీ (ap bjp) అధ్య‌క్షుడు సోము వీర్రాజు (somu verraju) కీలక వ్యాఖ్య‌లు చేశారు.

'హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన శ్రీ ఈటల రాజేంద‌ర్ గారికి శుభాకాంక్షలు. అధికారం అడ్డుపెట్టుకుని సాగించే దాడులు, ప్రలోభాలు, పంపకాలు తరహా దాడులు ప్రజా చైతన్యం ముందు దిగదుడుపేనని హుజూరాబాద్ ఉప‌ ఎన్నిక నిరూపించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా త్వరలో ఇలాంటి చైతన్యాన్ని ఆశిద్దాం' అని సోము వీర్రాజు ట్వీట్ చేశారు.. కాగా, ఏపీలో జ‌రిగిన బ‌ద్వేలు ఉప ఎన్నిక‌లో వైసీపీ చేతిలో బీజేపీ ఓడిపోయిన విష‌యం తెలిసిందే. వైసీపీ అభ్యర్ధి దాసరి సుధ (dasari sudha) దాదాపు 90,533 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్ధిపై విజయం సాధించారు. 

ALso Read:Huzurabad bypoll result 2021: కేసీఆర్ అహంకారం, ఈటల ఆత్మగౌరవం

హుజురాబాద్ ఉపఎన్నికలో (huzurabad byPoll) బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ (etela rajender) విజయం సాధించారు. తద్వారా వరుసగా ఏడోసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టబోతున్నారు. ఈ ఏడింటిలో నాలుగు సార్లు సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించగా.. మూడు సార్లు ఉప ఎన్నికల్లో విజయం సాధించడం గమనార్హం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి నాలుగుసార్లు, తెలంగాణ అసెంబ్లీకి మూడుసార్లు ఈటల గెలిచారు.  

తొలుత కమలాపూర్‌ (kamalapur) నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం సాధించగా.. ఆ తర్వాత ఐదు సార్లు హుజురాబాద్ నుంచే విజయ బావుట ఎగురవేశారు. ప్రస్తుత ఉపఎన్నికకు ముందు వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్.. ప్రతి ఎన్నికలోనూ భారీగా మెజారిటీ సాధించారు. చివరి మూడు ఎన్నికల్లో ఆయన మెజారిటీ 40 వేలకు వుంది. 2004లో అత్యత్పలంగా 19 వేల మెజారిటీతో గెలుపొందిన ఈటల..  2010 ఎన్నికల్లో అత్యధికంగా 79 వేల మెజారిటీ సాధించారు. తాజాగా జరిగిన ఉపఎన్నికలో ఈటల రాజేందర్‌కు 1,06,780 ఓట్లు పోలవ్వగా... టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 82,712 ఓట్లు పడ్డాయి. తద్వారా దాదాపు 24 వేల పైచీలుకు ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపొందారు. 

 

హుజురాబాద్ ఉపఎన్నికలలో ఘనవిజయం సాధించిన శ్రీ గారికి శుభాకాంక్షలు.
అధికారం అడ్డుపెట్టుకుని సాగించే దాడులు,ప్రలోభాలు,పంపకాలు తరహా దాడులు ప్రజా చైతన్యం ముందు దిగదుడుపేనని హుజురాబాద్ ఎన్నికలు నిరూపించాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో కూడా త్వరలో ఇలాంటి చైతన్యాన్ని ఆశిద్దాం . pic.twitter.com/jWGSB2ooRu

— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju)
click me!