విజయవాడ ఫోర్ మెన్ బంగ్లా వద్ద ఉద్రిక్తత (వీడియో)

By AN TeluguFirst Published Nov 3, 2021, 1:54 PM IST
Highlights

రైల్వే అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవడం లేదని స్థానికుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు రైల్వే గేటు మూసివేసి, మరోవైపు ఫోర్ మెన్ బంగ్లా రోడ్డు మూసేసినా స్థానిక మంత్రి మొద్దు నిద్ర పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ : విజయవాడ పాతబస్తీ ఫోర్ మెన్ బంగ్లా వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.  రహదారి మార్గాన్ని రైల్వే అధికారులు మూసివేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. 

"

vijayawada పాతబస్తీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. railway officers వైఖరిపై ఎమ్మెల్యే, ఎంపీ స్పందించక పోవడంపై జనం ఆందోళనకు దిగారు. 

రైల్వే అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవడం లేదని స్థానికుల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ వైపు railway gate మూసివేసి, మరోవైపు Four Men Bungalow రోడ్డు మూసేసినా స్థానిక మంత్రి మొద్దు నిద్ర పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైల్వే బ్రిడ్జి మరమ్మతులు పూర్తయ్యే వరకు  వించిపేట గేటును పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితు, రహదారి మూసివేతపై రైల్వే అధికారుల విచిత్ర వాదన వినిపిస్తున్నారు. 

ఈ దారి ప్రమాదకరంగా ఉండటంతో దారి మూసేసామని అధికారులు చెబుతున్నారు. కాగా, బైపాస్ మీద ఎందుకు వాహనాలు అనుమతిస్తున్నారని స్థానికులు అడిగిన ప్రశ్నలకు ఉద్యోగులు బదులివ్వడం లేదు. 

రోడ్డు మూసివేయడంతో ఆర్నెల్లుగా  జనాలు అగచాట్ల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ లాక్ డౌన్ సమయంలోనూ రైల్వే శాఖ మరమ్మతులపై దృష్టి పెట్టలేదని.. ప్రజలు పడే ఇబ్బందులు వారికి దృష్టిలోకి రావడం లేదని అన్నారు. 

అయితే రైల్వే అధికారులు మాత్రం దీనికి సంబంధించిన ఇప్పటికీ టెండర్లు పిలవలేదని, టెండర్లు ఖరారు అయ్యాక  పనులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు విజయవాడ ఎంపీకి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న ఫలితం లేదని ఆందోళన చేపట్టారు. 

జడ్జీలపై అనుచిత వ్యాఖ్యల కేసు.. సీబీఐపై హైకోర్టు ఆగ్రహం.. ‘అవసరమైతే సిట్ వేస్తాం’.. సాయంత్రానికల్లా ఉత్తర్వులు

బిల్డర్ హత్య..

ఇదిలా ఉండగా..విజయవాడ, విశాఖ నగరానికి చెందిన  పీతల అప్పల రాజు అలియాస్ రాజు (47) విజయవాడలో హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది.  దీనిపై పోలీసులు  విభిన్న కోణాల్లో విచారణ చేస్తున్నారు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి విశాఖ ఎంవిపి కాలనీ కి చెందిన  అప్పలరాజు  విజయవాడకి వెళ్లి Builder గా ఎదిగారు. అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నారు.

అజిత్ సింగ్ నగర్ క్రిష్ణ హోటల్ కూడలిలో ఆర్పీ కన్స్ట్రక్షన్స్ పేరుతో కార్యాలయ నడుపుతున్నారు.  రాజుకు భార్య  ఉమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  కుమారుడు ప్రవీణ్ ఎంబీఏ చదువుతున్నాడు. కుమార్తె రేష్మకు ఆగస్టులో  విశాఖలోనే వివాహం చేశారు.  సుమారు మూడేళ్ల క్రితం భార్య, పిల్లలను తీసుకుని MVP Sector-9 లో సొంత ఇంటికి వచ్చి అక్కడే ఉన్నారు.  

తాను Vijayawadaలోనే ఉంటూ భవన నిర్మాణ  కాంట్రాక్టులు చేస్తున్నారు.  దసరా పండుగకు విశాఖకు వచ్చిన అప్పలరాజు ఐదు రోజుల క్రితమే విజయవాడకు వెళ్లే ఇంతలోనే Murderకు గురికావడంతో బంధువులు స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.

అప్పలరాజు అతడి వద్ద పనిచేసే సాయికుమార్ ఓకే భవనంలో అద్దెకు ఉంటున్నారు.  బిల్డర్ పై అంతస్తులో సాయికుమార్ తన కుటుంబంతో కలిసి  కింది అంతస్తులో ఉంటున్నారు.  అప్పలరాజు ఫోన్ లిఫ్ట్ చేయడం  లేదని సాయి కుమార్ తో అన్నాడు.  దీంతో పైకి వెళ్లి చూడగా బిల్డర్ హత్య వెలుగుచూసింది.

click me!