ఉదయం 6 నుంచి 9 వరకే అనుమతి: కఠినచర్యలకు సిద్ధమైన ఏపీ

By Siva Kodati  |  First Published Mar 23, 2020, 8:07 PM IST

లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు బేఖాతరు చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 


లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు బేఖాతరు చేస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోనూ లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 

ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు అనుమతించింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా షట్‌డౌన్ చేస్తున్నామని.. ఆ సమయంలో ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆదేశించింది.

Latest Videos

undefined

Also Read:ప్రపంచం విలవిల: 15 వేలు దాటిన కరోనా మృతులు

ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు హోటళ్లలో పార్శిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతించింది. నిత్యావసరాలు, ఇతర అవసరాల కోసం కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలని సర్కార్ సూచించింది.

ఎపిడమిక్ డీసీజ్ యాక్ట్ ప్రకారం పలు సూచనలు సైతం చేసింది. ఈ నెల 29 నుంచి రేషన్‌ బియ్యం పంపిణీ చేయడంతో పాటు నిత్యావసర సరుకుల నిమిత్తం రూ.1,000 ఆర్ధిక సాయం చేయాలని అధికారులను ఆదేశించింది.

ఆర్ధిక సాయం నిమిత్తం రూ.1,330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని, లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఏప్రిల్ నెల రేషన్‌తో పాటు కిలో కందిపప్పును ఉచితంగా పంపిణీ చేయాలని తెలిపింది.

Also Read:లాక్‌డౌన్‌ అమలుకు తెలంగాణ కఠినచర్యలు: మెడికల్ షాపులు తప్ప.. అన్నీ క్లోజ్

విదేశాల నుంచి వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచే విధంగా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన వారిని పర్యవేక్షించడానికి ప్రతి 10 మందికీ ఒక అధికారి చొప్పున  కేటాయించారు. మండల స్థాయిలో కొంతమంది  అధికారులను కోవిడ్ 19 ప్రత్యేకాధికారులుగా నియమించారు.

విదేశాల నుంచి వచ్చిన వారి ఆరోగ్య పరిస్ధితులపై ప్రతి రోజు వివరాలు నమోదు చేయాలని, డేటా ఆధారంగా వైద్య శాఖ చర్యలు తీసుకోనుంది. అలాగే ఐఏఎస్ అధికారులు ప్రద్యుమ్న, గిరిజా శంకర్, కార్తికేయ మిశ్రా, కన్నబాబులను వైద్య ఆరోగ్య శాఖకు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 

click me!