ఎన్నికలకు సహకరిస్తాం.. కానీ: సీఎస్ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు

By Siva KodatiFirst Published Jan 26, 2021, 6:36 PM IST
Highlights

ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటామని ఏపీ ఎన్‌జీవోలు మీడియాకు తెలిపారు. ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారు. 

ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ సమావేశం ముగిసింది. పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటామని ఏపీ ఎన్‌జీవోలు మీడియాకు తెలిపారు. ఎన్నికల విధులకు సహకరించాలని సీఎస్ కోరారు.

వీలైనంత త్వరలో టీకా వేస్తామని చీఫ్ సెక్రటరీ హామీ ఇచ్చారని.. ఎన్నికల విధుల్లో కరోనాతో చనిపోతే పరిహారం ఇవ్వాలని ఏపీ ఎన్జీవోలు డిమాండ్ చేశారు. రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని కోరామని ఏపీ ఎన్జీవో‌లు చెప్పారు.

అలాగే ఎన్నికల విధుల్లో పాల్గొనేవారికి టీకా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ ఇచ్చేలా ఎన్నికలను రీ షెడ్యూల్ చేయాలని ఏపీ ఉద్యోగ జేఏసీ ప్రకటించింది. రేపటి భేటీలో ఈ అంశాన్ని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని సీఎస్‌ను కోరామని వారు వెల్లడించారు.

Also Read:అలా గెలిస్తే... అనర్హత వేటు, జైలు శిక్ష తప్పదు: సజ్జల హెచ్చరికలు

ఎన్నికల డ్యూటీ ఉద్యోగులకు పీపీఈ కిట్లు ఇవ్వాలని.. ఎస్ఈసీ అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తామని జేఏసీ స్పష్టం చేశారు. కరోనాతో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ ఎన్జీవో నేతలు గుర్తుచేశారు.

రేపు జరిగే ఎస్ఈసీ వీడియో కాన్ఫరెన్స్‌లోనూ పాల్గొంటామని పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను అనుసరించి తాము ఎన్నికల విధుల్లో పాల్గొంటామని అయితే 50 సంవత్సరాలు దాటిన మహిళా ఉద్యోగులకు విధుల నుంచి మినహాంపు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వం 985 జీవో ఇచ్చిందని.. ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్యలు వున్న వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇచ్చిందని ఇంకా ఆ జీవో విత్ డ్రా చేసుకోలేదని ఉద్యోగ నేతలు గుర్తుచేశారు. ఈ జీవోలో చెప్పిన వారికి కూడా ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. 

click me!