మదనపల్లిలో కూతుళ్ల హత్యలో ట్విస్ట్, పద్మజకు మానసిక సమస్యలు: డాక్టర్ రాధిక

By narsimha lode  |  First Published Jan 26, 2021, 5:43 PM IST

ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన దంపతులకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కీలక విషయాన్ని ప్రకటించారు. 


చిత్తూరు:  ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన దంపతులకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు కీలక విషయాన్ని ప్రకటించారు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో ఇద్దరు కూతుళ్లను చంపిన పురుషోత్తంనాయుడు, పద్మజలకు  పోలీసులు మంగళవారం నాడు వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షల సమయంలో కీలక విషయాలు వెలుగు చూశాయి. పురుషోత్తంనాయుడు భార్య పద్మజ తీవ్ర మానసిక వ్యాధితో బాధపడుతోందని డాక్టర్ రాధిక తెలిపారు.తన సమస్యను భర్త, కూతుళ్లకూ కూడ అంటించిందని  డాక్టర్ తెలిపారు. పురుషోత్తంనాయుడికి కూడ మానసిక సమస్య వచ్చిందన్నారు. 

Latest Videos

undefined

also read:మానసికంగా బాగానే ఉన్నారు: కూతుళ్లను చంపిన పేరేంట్స్‌పై డీఎస్పీ మనోహరాచారి

పద్మజ తండ్రి ఇటీవలనే మానసిక వ్యాధితో మరణించాడని ఆమె గుర్తు చేశారు. పద్మజ మేనత్త కూడా మానసిక వ్యాధిగ్రస్తురాలలేనని డాక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.చికిత్స తీసుకొంటే పురుషోత్తం, పద్మజ వ్యాధి నుండి కోలుకొంటారని ఆమె తెలిపారు. 

ఈ నెల 24వ తేదీన మదనపల్లిలో  ఇద్దరు పిల్లలను పురుషోత్తంనాయుడు ఆయన భార్య పద్మజ కొట్టి చంపారు. చనిపోయిన తర్వాత తిరిగి బతికి వస్తారని వీరు భావించారు.

click me!