ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలు: ఏకగ్రీవాలకు సర్కార్ ప్రొత్సాహకాలు

By Siva KodatiFirst Published Jan 26, 2021, 7:23 PM IST
Highlights

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఏకగ్రీవాలకు ప్రభుత్వం ప్రొత్సాహాకాలు ప్రకటించింది. దీనిలో భాగంగా 5 వేల వరకు జనాభా వుండే పంచాయతీలకు ఏకగ్రీవమైతే రూ.15 లక్షలు, 5 వేల నుంచి 15 వేల జనాభా వున్న పంచాయతీల ఏకగ్రీవానికి రూ.30 లక్షలు, 15 వేల జనాభా వున్న పంచాయతీలు ఏకగ్రీవమైతే రూ.50 లక్షల ప్రొత్సాహకం ప్రకటించింది. 

Also Read:ఎన్నికలకు సహకరిస్తాం.. కానీ: సీఎస్ ముందు ఉద్యోగ సంఘాల డిమాండ్లు 

మరోవైపు ఏపీ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పీడ్‌ పెంచారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై బదిలీ వేటు వేసిన ఎస్‌ఈసీ శాంతి భద్రతల అంశంపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది.

పంచాయతీ ఎన్నికల్లో శాంతిభద్రతల పర్యవేక్షణకు ఐజీ స్థాయి అధికారిని నియమించారు నిమ్మగడ్డ రమేష్‌కుమర్‌. డాక్టర్‌ సంజయ్‌ని శాంతిభద్రతల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఏకగ్రీవాలు, హింస, అల్లర్లు, కోడ్‌ ఉల్లంఘనలను ఐజీ సంజయ్‌ పర్యవేక్షిస్తారు. ఈ మేరకు ఆయన నిమ్మగడ్డని కలిసి రిపోర్ట్‌ చేశారు.
 
click me!
Last Updated Jan 26, 2021, 7:23 PM IST
click me!