ఎస్ఈసీ ఆదేశం: విధుల నుంచి తప్పుకున్న చిత్తూరు కలెక్టర్

By Siva KodatiFirst Published Jan 26, 2021, 6:55 PM IST
Highlights

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా విధుల నుంచి తప్పుకున్నారు. దీనిలో భాగంగా రేపు జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు. గుప్తా స్థానంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. మార్కండేయులకు ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలతో చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా విధుల నుంచి తప్పుకున్నారు. దీనిలో భాగంగా రేపు జీఏడీలో రిపోర్ట్ చేయనున్నారు. గుప్తా స్థానంలో చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ డి. మార్కండేయులకు ప్రభుత్వం ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. 

కాగా, గత మార్చిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియ సందర్భంగా కొంత మంది అధికారులను బదిలీ చేయాలని తామిచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలనశాఖ(పొలిటికల్‌)కు సోమవారం మరోసారి లేఖ రాశారు.

Also Read:చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల బదిలీకి ఎస్ఈసీ సిఫారసు: సీఎస్ కు నిమ్మగడ్డ లేఖ

గత ఏడాది మార్చి 15న ఆయన ఆయన మీడియా సమావేశం నిర్వహించి కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను 6 వారాల పాటు వాయిదావేస్తూ... అత్యంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న గుంటూరు, చిత్తూరు జిల్లాల కలెక్టర్లు శామ్యూల్‌ ఆనంద్‌, భరత్‌ గుప్తా, గుంటూరు రూరల్‌ ఎస్పీ విజయారావు, తిరుపతి అర్బన్‌ ఎస్పీ ఆవుల రమేశ్‌రెడ్డిలను ఆ విధుల నుంచి వెంటనే తప్పించి, ప్రత్యామ్నాయ అధికారులను సూచించాలని ప్రభుత్వాన్ని కోరారు.

అలాగే మాచర్లలో జరిగిన హింసాత్మక సంఘటన నేపథ్యంలో సీఐ రాజేశ్వరరావును సస్పెండ్‌ చేయాలని, శ్రీకాళహిస్తి, పలమనేరు డీఎస్పీలు నాగేంద్రుడు, ఆరిఫుల్లా, రాయదుర్గం, తాడిపత్రి సీఐలు తులసీరాం, తేజోమూర్తిలను బదిలీ చేయాలని సూచించారు. . చిత్తూరు, గుంటూరు కలెక్టర్ల నుంచి ఆయా జాయింట్‌ కలెక్టర్‌-1లు చార్జ్‌ తీసుకోవాలని, తిరుపతి అర్బన్‌ ఎస్పీ, చిత్తూరు ఎస్పీకు చార్జ్‌ అప్పగించాలని సూచించారు
 

click me!