కొరియర్‌లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన యువకులు.. కాకినాడలో కలకలం..

Published : Oct 31, 2022, 04:32 PM IST
కొరియర్‌లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన యువకులు.. కాకినాడలో కలకలం..

సారాంశం

కొందరు యువకులు కొరియర్‌లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. డీటీడీసీ కొరియర్ సంస్థ ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగుచూసింది. 

కొందరు యువకులు కొరియర్‌లో డ్రగ్స్ ఆర్డర్ చేసిన ఘటన కాకినాడలో కలకలం రేపింది. డీటీడీసీ కొరియర్ సంస్థ ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెలుగుచూసింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు. అలాగే కొరియర్‌పై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయనే వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu