ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై వేటు పడింది.
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు పంచాయితీరాజ్ శాఖ ఉన్నతాధికారులపై వేటు పడింది.
పంచాయితీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా గోపాలకృష్ణ ద్వివేది ఉన్నారు. పంచాయితీ రాజ్ శాఖ కమిషనర్ గా గిరిజా శంకర్ పనిచేస్తున్నారు. వీరిద్దరిని బదిలీ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు.
also read:జగన్ తో భేటీ, నిమ్మగడ్డ సమావేశానికి డుమ్మా: అధికారులకు మెమో జారీ
ఈ ఆదేశాల మేరకు వీరిపై బదిలీ వేటు వేసింది రాష్ట్ర ప్రభుత్వం . ఈ రెండు స్థానాల్లో ఇతరులను నియమించేందుకు మూడేసి పేర్లతో జాబితాను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పంపనున్నారు.
also read:ఏక కాలంలో వ్యాక్సినేషన్, ఎన్నికలపై కేంద్రానికి లేఖ: బొత్స సత్యనారాయణ
ఈ నెల 22వ తేదీన ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ ఇద్దరు అధికారులు హాజరు కాలేదు. ఉదయం సమావేశం ఏర్పాటు చేస్తే మధ్యాహ్నం మూడు గంటలకు వస్తామని సమాచారం పంపారు.
మధ్యాహ్నం చెప్పిన సమయానికి కూడ హాజరుకాలేదు. అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు వారిద్దరికి ఎస్ఈసీ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే.