రేపు కృష్ణానదీ యాజమాన్య బోర్డు భేటీ: ఎజెండా పంపిన ఏపీ సర్కార్

By Siva KodatiFirst Published Jun 3, 2020, 8:05 PM IST
Highlights

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఎజెండా ఏపీ ప్రభుత్వం పంపించింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదలతో ఏపీ ప్రభుత్వం నష్టపోతోందని, కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడ తరలించాలని జగన్ సర్కార్ డిమాండ్ చేస్తోంది

కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఎజెండా ఏపీ ప్రభుత్వం పంపించింది. సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నీటి విడుదలతో ఏపీ ప్రభుత్వం నష్టపోతోందని, కృష్ణా నది యాజమాన్య బోర్డును విజయవాడ తరలించాలని జగన్ సర్కార్ డిమాండ్ చేస్తోంది.

కృష్ణానదిపై నిర్మాణం చేపడుతున్న తెలంగాణ ప్రాజెక్ట్‌లపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వరద జలాలు వచ్చినప్పుడు వాడుకున్న నీటిని లెక్కించవద్దని ప్రభుత్వం చెబుతోంది.

గురువారం కృష్ణా బోర్డు, శుక్రవారం గోదావరి బోర్డు సమావేశం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు జలసౌధలో కృష్ణాబోర్డు సమావేశం అవుతోంది. ఈ భేటీలో ఐదు అంశాలపై చర్చించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎల్లుండి జరిగే గోదావరి బోర్డు సమావేశంలో తెలంగాణపై ఏపీ ప్రభుత్వ ఫిర్యాదు మీద చర్చించే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్ట్‌లపై తెలుగు రాష్ట్రాలు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో వేరు వేరుగా రెండు బోర్డులు సమావేశం కానున్నాయి. 

click me!