ఏపీలో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్... జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

Arun Kumar P   | Asianet News
Published : Apr 16, 2021, 09:43 AM ISTUpdated : Apr 16, 2021, 09:47 AM IST
ఏపీలో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్... జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు

సారాంశం

రాష్ట్రంలో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   

అమరావతి: దేశవ్యాప్తంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్ననేపథ్యంలో జగన్ సర్కార్ మరోసారి అప్రమత్తమయ్యింది. రాష్ట్రంలో కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

కొవిడ్‌ నివారణ, వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 21మంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో కృష్ణబాబు, రవిచంద్ర, పీయూష్‌కుమార్‌, బాబు.ఎ, మల్లికార్జున్‌, విజయరామరాజు, అభిషేక్‌ మహంతి, శ్రీకాంత్‌లు వున్నారు. 

read more   ఏపీలో నిండుకున్న టీకా నిల్వలు: అధికారులతో జగన్ అత్యవసర సమావేశం

ఇదిలావుంటే ఏపీలో గత 24 గంటల్లో5,096 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 42వేల 135 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో ఐదుగురు, అనంతపురం, కర్నూల్, విశాఖపట్టణంలలో ఇద్దరు చొప్పున చనిపోయారు. కడప, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరిచొప్పున మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,353 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,55,70,201 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 35,741 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో5,086మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,745 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 9 లక్షల 03 వేల 072 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 31,710 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 334, చిత్తూరులో 835,తూర్పుగోదావరిలో 450,గుంటూరులో 611, కడపలో 096,కృష్ణాలో 396, కర్నూల్ లో 626, నెల్లూరులో 223,ప్రకాశంలో 236, శ్రీకాకుళంలో 568, విశాఖపట్టణంలో 432, విజయనగరంలో 248,పశ్చిమగోదావరిలో 031కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -70,415 మరణాలు 613
చిత్తూరు  -97008,మరణాలు 904
తూర్పుగోదావరి -1,27,556, మరణాలు 638
గుంటూరు  -84,128, మరణాలు 689
కడప  -57,667, మరణాలు 466
కృష్ణా  -53,927,మరణాలు 696
కర్నూల్  -64,339, మరణాలు 505
నెల్లూరు -65,802,మరణాలు 529
ప్రకాశం -64, 592,మరణాలు 590
శ్రీకాకుళం -49,680,మరణాలు 351
విశాఖపట్టణం  -66,425,మరణాలు 592
విజయనగరం  -42,585, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,893, మరణాలు 542

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్