వైఎస్ జగన్ కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్ మీద సీబీఐ కోర్టు విచారణ

Published : Apr 16, 2021, 08:00 AM IST
వైఎస్ జగన్ కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్ మీద సీబీఐ కోర్టు విచారణ

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 22న పిటిషన్ విచారణకు రానుంది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు షాక్ తగిలించింది. జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణమ రాజు దాఖలు చేసిన పిటిషన్ ను సిబిఐ కోర్టు విచారణకు స్వీకరించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగన్ మీద సిబిఐ 11 చార్జిషీట్లను దాఖలు చేసిందని రఘురామకృష్ణమ రాజు తన పిటిషన్ లో చెప్పారు. 

ప్రతి చార్జిషీట్ లో కూడా జగన్ తొలి ముద్దాయిగా ఉన్నారని అంటూ త్వరతిగతిన విచారణ పూర్తి చేయాలని కోరారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా తమ పార్టీకి చెడ్డ పేరు రాకుడా ఉండాలని తాను పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు 

జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని, అది ఈ నెల 22వవ తేదీన విచారణకు వస్తుందని రఘురామకృష్ణమ రాజు ఢిల్లీలో గురువారం మీడియాతో చెప్పారు ఐఏఎస్ అధికారులను ఏసిర్ రిపోర్టును స్వయంగా ముఖ్యమంత్రి రాస్తానని చెప్పడం వారిని చెప్పుచేతల్లో పెట్టుకునేందుకేనని ఆయన అన్నారు. అధికారులను తన అదుపులో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న జనగ్ తన కేసులో వారి సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉందని ఆయన అన్నారు 

ఆ విషయంపై తాను ప్రధానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు త్వరలో ప్రధాని కార్యాలయం స్పందిస్తుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏపీలో అమలు కావడం లేదని, ఓ వ్యక్తితో జగన్ తనను తిట్టించారని ఆయన విమర్శించారు. తనను కుక్క అని ఆ వ్యక్తి దూషించాడని ఆయన అన్నారు. 

తనకు సంస్కారం ఉంది కాబట్టి తాను ముఖ్యమంత్రిని ఆ మాటలు అనడం లేదని, తొత్తులతో జగన్ తనను తిట్టిస్తే తాను వారి మీదికి వెళ్లబోనని, జగన్ మీదికే వస్తానని ఆయన అన్నారు. కొంత మంది సీబీఐ అధికారులకు ఫ్లాట్స్ కూడా కొనిస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతిలో వైసీపీకి 50 వేల మెజారిటీ కూడా వచ్చే పరిస్థితి లేదని, తాను సభ పెట్టినా మెజారిటీ రాదని గ్రహించి జగన్ తిరుపతిలో సభను రద్దు చేసుకున్నారని ఆయన అన్ారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్