ఏపీలో దసరా సెలవు మార్పు.. నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో దసరా పండగ సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24వ తేదీని విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

Google News Follow Us

ఆంధ్రప్రదేశ్‌లో దసరా పండగ సెలవును మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 24వ తేదీని విజయదశమి సందర్భంగా సాధారణ సెలవుగా గుర్తిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దసరా పండగకు సంబంధించి.. అక్టోబర్ 23వ తేదీని సాధారణ సెలవుగా, 24వ తేదీని దసరా ఆప్షనల్ హాలిడేగా ప్రకటించగా.. ఇప్పుడు అందులో స్వల్ప మార్పులు చేశారు. అక్టోబర్ 24వ తేదీన విజయదశమి కావడంతో.. ఆ రోజు సాధారణ సెలవును ప్రకటించారు.  అయితే తాజాగా విడుదలైన నోటిఫికేషన్‌తో దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 23, 24 తేదీలు సాధారణ సెలవులుగా ప్రభుత్వం పేర్కొన్నట్టు అయింది. 

ఇదిలాఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో స్కూల్స్‌కు ఈ నెల 14 నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. దసరా సెలవుల అనంతరం అక్టోబరు 25న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 11 రోజుల పాటు పాఠశాలలకు దసరా సెలవులు ఉంటాయి.