ఇక నుండి ఆరు పేపర్లే: టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

By narsimha lodeFirst Published Aug 22, 2022, 9:33 PM IST
Highlights

ఈ విద్యా సంవత్సరం నుండి టెన్త్ క్లాసులో ఆరు పరీక్ష పేపర్లే ఉంటాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 11 పేపర్లకు బదులుగా ఆరు ప్రశ్నాపత్రాలే ఉంటాయని ఏపీ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 

అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈ విద్యా సంవత్సరం నుండి ఆరు ప్రశ్నాపత్రాలే ఉంటాయని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. 2022-23 విద్యా సంవత్సరం నుండి అమలు చేయాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు సోమవారం నాడు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ సెక్రటరీ రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో టెన్త్ క్లాసులో 11పేపర్లకు బదులుగా  కరోనా కారణంగా ఏడు పేపర్లకే కుదించింది ఏపీ ప్రభుత్వం. విద్యా వ్యవస్థలో ఏపీ ప్రభుత్వం ఇటీవల కాలంలో కీలక మార్పులు చేస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం బోధన వంటి అంశాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే.  కేంద్ర ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులతో పాటు రాష్ట్ర విద్యార్ధులు పోటీ పరీక్షల్లో రాణించేలా ప్రభుత్వ స్కూళ్లలో విద్యా బోధనలో మార్పులు చేర్పులు చేస్తున్నామని ప్రభుత్వం గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే సీబీఎస్ఈ తరహలోనే టెన్త్ క్లాసులో ఆరు పేపర్లకే కుదించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక వంటి కార్యక్రమాలను కూడ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది.ఈ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్ధులకు అవసరమైన సహాయాన్ని అందిస్తుంది. 

 


 

click me!