కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీకి రావాల్సిన బకాయిల విషయమై కేంద్ర మంత్రి ఆర్ కే సింగ్ తో జగన్ చర్చించారు.
న్యూఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్ కే సింగ్ తో ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ ముగిసిన తర్వాత కేంద్ర విద్యుత్ శాఖ మంత్రితో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు.తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీ రాష్ట్రానికి రావాల్సిన బకాయిల విషయమై ఈ సమావేశంలో చర్చించినట్టుగా సమాచారం. అంతేకాదు తెలుగు రాష్ట్రాలతో పాటు 13 రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ పవర్ ఎక్చేంజ్ ల్లో విద్యుత్ కొనుగోలు చేయడంపై కేంద్రం ఈ నెల 18వ తేదీ రాత్రి నుండి నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే ఏపీ రాష్ట్రం విద్యుత్ కోనుగోలు విషయమై పవర్ ఎక్చేంజీలకు ఎలాంటి బకాయిలు లేవని ఏపీ ఇంధన శాఖ సెక్రటరీ విజయానంద్ ప్రకటించారు. దీంతో ఈ నిషేధం ఏపీకి వర్తించదని కూడా ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే.