ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతాం: జల వివాదంపై సజ్జల

Published : Jul 04, 2021, 02:18 PM IST
ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతాం: జల వివాదంపై సజ్జల

సారాంశం

జల వివాదంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆదివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు.

అమరావతి:జల వివాదంపై ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడుతామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
ఆదివారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో  రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చేస్తోందని ఆయన చెప్పారు. జల వివాదాలపై రెండు రాష్ట్రాల సీఎంలు మాట్లాడుకోవాలని  ఆయన సూచించారు.

also read:జల వివాదంపై హైకోర్టుకి ఏపీ రైతులు: తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

రాష్ట్ర వాటా కింద దక్కిన నీటిలో ఒక్క చుక్కను కూడ వదులుకోమని ఆయన స్పష్టం చేశారు.జల వివాదంపై  ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ విషయమై కేంద్రం కూడ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతామని కేంద్రం హామీ ఇచ్చిందని ఆయన చెప్పారు.

రెచ్చగొడితే తాము రెచ్చిపోమని ఆయన చెప్పారు. కృష్ణా బేసిన్ లో విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ ప్రభుత్వం నిలిపివేయాలని ఏపీ, పోతిరెడ్డిపాడు మధ్య ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మించొద్దని తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. ఈ విషయమై  ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్