న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని తెర వెనుక వికృత చర్యలు: టీడీపీపై సజ్జల ఫైర్

By narsimha lode  |  First Published Oct 11, 2021, 2:52 PM IST


 గృహ నిర్మాణ పథకానికి సంబంధించి కోర్టుకు వెళ్లి నిలుపుదల చేయించడం వెనుక టీడీపీ హస్తం ఉందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. హైకోర్టు సింగిట్ జడ్జి ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ న ఆశ్రయిస్తామన్నారు.


అమరావతి: రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకానికి సంబంధించి కోర్టుకు వెళ్లి నిలుపుదల చేయించడం వెనుక టీడీపీ హస్తం ఉందని తాము అనుమానిస్తున్నామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు sajjala ramakrishna reddy చెప్పారు.

also read:గృహ నిర్మాణాలపై ఏపీ సర్కార్‌కు మరోషాక్ ... హౌస్ మోషన్ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్ట్

Latest Videos

సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారుap high court ఆదేశాలతో పేదల సొంతింటి కల సాకారానికి అడ్డంకిగా మారిందన్నారు.కొన్ని రాజకీయ శక్తులు తెరవెనుక వికృత చర్యలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.న్యాయస్థానాలను తమ ప్రయోజనాలకు వాడుకొంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. 

ఇళ్లు లేని పేదలు ఉండకూడదనే ఉద్దేశ్యంతో తమ ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి రూపకల్పన చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలు 31 లక్షల మంది ఉన్నారని సజ్జల చెప్పారు. పేదలకు ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రంలో సుమారు 17 వేల కొత్త ఊళ్లు వస్తున్నాయని ఆయన చెప్పారు.  ఈ కాలనీల్లో 32 వేల కోట్లతో మౌళిక  సదుపాయాల ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన తెలిపారు.ఖర్చు ఎక్కువైనా కూడా ఇండిపెండెంట్ ఇళ్లనే నిర్మిస్తున్నామన్నారు.

హైకోర్టు సింగిల్ జడ్జి ఆదేశాలపై డివిజన్ బెంచ్ ను ఆశ్రయిస్తామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. డివిజన్ బెంచ్ లో తాము విజయం సాధిస్తామనే నమ్మకం ఉందన్నారు సజ్జల.

నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ys jagan సర్కార్ నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా 2019 డిసెంబర్ 2న 367,488 జీవోను జారీ చేసింది.

ఈ జీవోను సవాల్ చేస్తూ tenaliకి చెందిన పొదిలి శివ మురళి, మరో 128 మంది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కేవలం మహిళల పేరునే పట్టాలివ్వడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.  పురుషులు, ట్రాన్స్‌జెండర్ల పేరుతో కూడా ఇళ్ల స్థలాలను కేటాయించాలని హైకోర్టు తెలిపింది.ఈ విషయమై ఏపీ ప్రభుత్వం  హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. హౌస్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు ఆదివారం నాడు  తిరస్కరించింది.

 

click me!