కన్నతల్లే కాటికి పంపింది.. చిన్నారుల మెడకు ఉరివేసి...

Published : Oct 11, 2021, 07:50 AM IST
కన్నతల్లే కాటికి పంపింది.. చిన్నారుల మెడకు ఉరివేసి...

సారాంశం

ఈ విషయం విన్న వెంటనే షాక్ అయిన తమ్ముడు.. హుటాహుటిన వచ్చి పిల్లలని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆ చిన్నారులు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వెంటనే విషయం పోలీసులకు తెలిపారు.  త్రీటౌన్ సిఐ మధుబాబు ఆస్పత్రికి చేరుకుని నిందితురాలి నుంచి వివరాలు సేకరించారు.

రాజమహేంద్రవరం :  కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లి తన పిల్లలను ఉరివేసి హతమార్చింది. ఈ దారుణ ఘటన ఆదివారం రాత్రి 11 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో జరిగింది.  వివరాల్లోకి వెళితే…  స్థానిక మల్లయ్య పేట కు చెందిన లక్ష్మి అనూష తన కుమార్తె చిన్మయి (8), కుమారుడు మోహిత్ శ్రీ సత్య (5) ను హత్య చేసింది.  ఆ తర్వాత ఈ విషయాన్ని తన తమ్ముడికి ఫోన్ చేసి మరీ చెప్పింది.

ఈ విషయం విన్న వెంటనే షాక్ అయిన తమ్ముడు.. హుటాహుటిన వచ్చి పిల్లలని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే, అప్పటికే ఆ చిన్నారులు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వెంటనే విషయం పోలీసులకు తెలిపారు.  త్రీటౌన్ సిఐ మధుబాబు ఆస్పత్రికి చేరుకుని నిందితురాలి నుంచి వివరాలు సేకరించారు.

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కు చెందిన పూలేటి రాముకు 11 ఏళ్ల క్రితం సీతా నగరానికి చెందిన లక్ష్మి అనూషతో వివాహమైంది.  వీరికి ఇద్దరు సంతానం.  అయితే కుటుంబంలో కలహాలు రావడంతో తాను గతంలో suicide చేసుకున్నాడు.  అప్పటి నుంచి లక్ష్మి అనూష మల్లయ్య పేట లో నివాసం ఉంటుంది.

చంద్రబాబుకు షాక్, టీడీపీకి గంటా శ్రీనివాసరావు గుడ్‌బై.. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా..?

భర్త చనిపోయాడన్న వేదనో, కుటుంబాన్ని ఒంటరిగా నెట్టుకురాలేకపోతున్న అసహాయతో.. మరే విషయమో కానీ మొత్తానికి ఆమె.. తరచుగా తన పిల్లలను చిత్రహింసలకు గురి చేసేదని స్థానికులు చెబుతున్నారు.  శనివారం రాత్రి కూడా పిల్లల్ని రక్తం వచ్చేటట్లు కొట్టిందని తెలిపారు.  

అయితే తన కుటుంబం పరిస్థితి బాగోలేదని,  పిల్లలను పోషించలేక కనీసం తిండి కూడా పెట్టలేక చంపేశానని తల్లి చెబుతోంది. కానీ ఆమెకు ఆర్థిక ఇబ్బందులు లేవని, ఈ హత్యలకు వేరే కారణం ఉండి ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Tirumala Vaikunta Dwaram: టికెట్ లేని భక్తులకు ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు| Asianet News Telugu
ఫ్యూచర్ కోసం ఈ ఏడాది రిజల్యూషన్ తీసుకుందాం: Doctor Ratna Pemmasani | Plastic | Asianet News Telugu