ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జెన్ కో సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు రేపటి నుండి సహాయ నిరాకరణకు దిగనున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ సెక్రటరీకి లేఖ రాశారు.
అమరావతి: Andhra Pradesh రాష్ట్రంలోని Genco సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఈ నెల 15 నుండి సహాయ నిరాకరణ చేపడుతామని ప్రకటించారు. ఈ మేరకు ఇంధన శాఖ కార్యదర్శికి Employees సోమవారం నాడు లేఖ రాశారు. ఈ letterలో తమ డిమాండ్లను జెన్ కో ఉద్యోగులు ప్రస్తావించారు.
వేతనాల చెల్లింపు, ఫింఛన్ చెల్లించాలని కూడా ఆ లేఖలో ఉద్యోగులు కోరారు. జనవరి మాసం వేతనాలు ఇంకా రాలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే Teachers సంఘాలు ఆందోళన కార్యాచరణను ప్రకటించాయి. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం సమ్మె నుండి వెనక్కి త్గగ్గాయి.
ఈ నెల 7వ తేదీ నుండి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తొలుత సమ్మె నోటీసును ఇచ్చాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలపై ఉద్యోగ సంఘాలు సంతృప్తిని వ్యక్తం చేశాయి. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం ఈ చర్చల పట్ల సంతృప్తిగా లేవు.
ఉద్యోగ సంఘాల నేతల తీరును ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు ఐక్యకార్యాచరణగా ఏర్పడి ఆందోళనలను కొనసాగిస్తున్నాయి.మరోవైపు జెన్ కో ఉద్యోగులు కూడా ఆందోళన బాట పడుతున్నారు. రేపటి నుండి సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించారు.