వృద్ధి దిశగా పయనిస్తోంటే.. తిరోగమనంటూ ప్రచారం: టీడీపీపై బుగ్గన మండిపాటు

By Siva KodatiFirst Published Jan 2, 2022, 3:08 PM IST
Highlights

టీడీపీ నేతలపై మండిపడ్డారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని టీడీపీ  ప్రయత్నం  చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలపై మండిపడ్డారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. మరోసారి రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని టీడీపీ ప్రయత్నం  చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం రెండంకెల వృద్ధి దిశగా పయనిస్తుంటే ఓర్వలేకే అబద్ధాలని దుయ్యబట్టారు. సానుకూల వృద్ధి దిశగా పయనిస్తుంటే తిరోగమన వృద్ది అని ప్రచారమని.. వైసీపీ సర్కార్ హయాంలో 2019-20లో వృద్ధి రేటు పెరిగిందని బుగ్గన స్పష్టం చేశారు. 

కరోనా కష్టాలతో మధ్యలో తగ్గినా ఇప్పుడు పరిస్థితులు సానుకూలంగా వున్నాయని.. కరోనాలోనూ తలసరి ఆదాయలు పడిపోకుండా చూశామన్నారు. రెవెన్యూ లోటు తగ్గుతోందని కాగ్ చెప్తున్నా పెరుగుతోందని అబద్ధాలు చెబుతున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. 2020-21లో కేంద్రంతో పోలిస్తే ద్రవ్యలోటు , రెవెన్యూ లోటు తక్కువేనని బుగ్గన పేర్కొన్నారు. ప్రతీ అప్పుకూ , ప్రతీ ఖర్చుకూ లెక్కలున్నాయని.. ప్రత్యక్ష నగదు బదిలీలో ఇతర రాష్ట్రాల కంటే మెరుగైన స్థానంలో ఏపీ వుందన్నారు. 

ALso Read:చేనేత రంగాన్ని ఆదుకోవాలి.. టెక్స్‌టైల్ పరిశ్రమపై జీఎస్టీని వద్దన్నాం : బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

కాగా.. శుక్రవారం నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (buggana rajendranath reddy ) మీడియాతో మాట్లాడారు. చేనేత వస్త్రాల మీద 12శాతం జీఎస్టీ వేయాలన్న ప్రతిపాదనను ఏపీ సహా అన్ని రాష్ట్రాలు వ్యతిరేకించాయని తెలిపారు. ఈ ప్రతిపాదనలను జీఎస్టీ కౌన్సిల్ పక్కన పెట్టిందని, పాలిమర్, కాటన్ వస్త్రాలు ఉత్పత్తి శాతంపైన ఎలాంటి డేటా లేదని బుగ్గన అన్నారు. రిఫండ్ శాతంపై ఎలాంటి  వివరాలు లేకుండా  నిర్ణయం తీసుకోలేమని మంత్రి తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్‌లో కాటన్ వస్త్రాల వాడకం ఉందని, చేనేత కార్మికులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ys jagan) కోరారని పేర్కొన్నారు. చేనేత కార్మికులు, వ్యాపారులకు ఎలాంటి నష్టం జరగకూడదన్నారు. చేనేత మీద లక్షలాది మంది కార్మికులు ఆధారపడి ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. చేనేత రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని, చేనేత వస్త్రాల మీద ప్రస్తుతం ఉన్న 5శాతాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారని రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మొత్తం విషయంపై ప్రత్యేక అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. 
 

click me!