ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

By narsimha lodeFirst Published Jan 2, 2022, 2:43 PM IST
Highlights

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.

తిరుపతి: ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన ప్రభుత్వానికి లేదని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చెప్పారు.ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని Tdp  చీఫ్ Chandrababu చేసిన వ్యాఖ్యలపై Mithun reddy ఆదివారం నాడు  తిరుపతిలో స్పందించారు. ఐదేళ్ల పాటు తాము అధికారంలో ఉంటామని మిథున్ రెడ్డి చెప్పారు. పార్టీని కాపాడుకొనేందుకు గాను చంద్రబాబునాయుడు ముందస్తు ఎన్నికల గురించి మాట్లాడుతున్నారన్నారు.  

దేశ వ్యాప్తంగా అన్ని ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం మదిలో ఉంది. దీంతో  అన్ని రాష్ట్రాలకు ఎన్నికలను ఒకేసారి నిర్వహించడంపై లాభ నష్టాలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. కొన్ని పార్టీలు దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నాయి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతుంది. Trs  సర్కార్  గతంలో మాదిరిగానే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతుంది. అయితే ఈ ప్రచారాన్ని టీఆర్ఎస్ నాయకత్వం ఖండిస్తోంది. గత మాసంలో టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో  ఈ దఫా ముందస్తు ఎన్నికలకు తాము వెళ్లే ప్రసక్తే లేదని టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రకటించారు. అయితే bjp కి చెందిన తెలంగాణ నేతలు గత వారంలో delhi లో సమావేశమైన సమయంలో కూడా తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయమై చర్చ సాగింది. టీఆర్ఎస్ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్తే  సిద్దంగా ఉండాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి Amit shah  సూచించారు.  

మరో వైపు ఏపీ రాష్ట్రంలో కూడా ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని విపక్షాలు చెబుతున్నాయి. అయితే Ycp  నేతలు మాత్రం ముందస్తు ఎన్నికల అంశాన్ని కొట్టిపారేస్తున్నారు.శనివారం నాడు చంద్రబాబునాయుడు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సమయంలో  ముందస్తు ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన చెప్పారు.


 

click me!